TS Cinema Theaters Closed Row: తెలంగాణలో సినిమా థియేటర్ల మూసివేత, ఖండించిన సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, థియేటర్లు మూసివేస్తారన్న ప్రచారాన్ని నమ్మొద్దు అని సూచన
కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో తెలంగాణలో థియేటర్లు మూసివేస్తారని (TS Cinema Theaters Closed) వస్తున్న వార్తలను సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. రాష్ర్టంలో సినిమా థియేటర్లను మూసివేయడం లేదని (cinema theaters will not be closed) తేల్చిచెప్పారు. థియేటర్లు మూసివేస్తారన్న ప్రచారాన్ని నమ్మొద్దు అని సూచించారు.
Hyderabd, Mar 24: తెలంగాణలో సినిమా థియేటర్ల మూసివేతపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో తెలంగాణలో థియేటర్లు మూసివేస్తారని (TS Cinema Theaters Closed) వస్తున్న వార్తలను సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. రాష్ర్టంలో సినిమా థియేటర్లను మూసివేయడం లేదని (cinema theaters will not be closed) తేల్చిచెప్పారు. థియేటర్లు మూసివేస్తారన్న ప్రచారాన్ని నమ్మొద్దు అని సూచించారు. కొవిడ్ నిబంధనలతో సినిమా థియేటర్లు యథాతథంగా నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు. థియేటర్లకు వెళ్లే ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, విధిగా మాస్కు ధరించి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఇద్దరికి కరోనా సోకింది. ఐదో అంతస్తులోని చీఫ్ ఇంజినీర్ విభాగంలో ఇద్దరు ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. దీంతో ఐదో అంతస్తును అధికారులు శానిటైజ్ చేయించారు. ఆ అంతస్తులో పనిచేస్తున్న ఉద్యోగులకు సెలవు ప్రకటించారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో ఇద్దరు బాధితులు మరణించారు. మొత్తం కేసుల్లో ప్రస్తుతం 3352 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 1395 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 111 కేసులు ఉన్నాయి.