Modi Visit Telangana: నేడు మహబూబ్‌నగర్‌ కు ప్రధాని మోదీ.. కేసీఆర్ మళ్లీ గైర్హాజరు.. వైరల్ ఫీవర్‌ తో బాధపడుతున్న ముఖ్యమంత్రి.. శంషాబాద్‌ లో మోదీకి స్వాగతం పలకనున్న మంత్రి తలసాని.. మోదీ పర్యటన షెడ్యూల్ ఇలా..

ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ కు మధ్య ఇంకా దూరం కొనసాగుతూనే ఉన్నది. ప్రధాని ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ఆయనకు స్వాగతం పలకకుండా దూరంగా ఉంటున్న కేసీఆర్ ఈసారి కూడా ప్రధాని తెలంగాణ పర్యటనకు గైర్హాజరవుతున్నారు.

PM Narendra Modi (Photo-ANI)

Hyderabad, Oct 1: ప్రధాని నరేంద్రమోదీకి (PM Modi) తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) కు మధ్య ఇంకా దూరం కొనసాగుతూనే ఉన్నది. ప్రధాని ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ఆయనకు స్వాగతం పలకకుండా దూరంగా ఉంటున్న కేసీఆర్ (KCR) ఈసారి కూడా ప్రధాని తెలంగాణ పర్యటనకు గైర్హాజరవుతున్నారు. ఆయనకు బదులుగా మంత్రులను పురమాయిస్తున్నారు. నేటి మధ్యాహ్నం 1.30 గంటలకు మోదీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాధారణంగా సీఎం ఆయనకు స్వాగతం పలకాల్సి ఉండగా.. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈసారి స్వాగతం పలుకుతారు. కేసీఆర్ వైరల్ ఫీవర్‌ తో బాధపడుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Dasara Holidays: ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. 13 తారీఖు నుంచి 25 వరకూ దసరా సెలవులు.. అక్టోబర్ 26 నుంచి స్కూళ్లు పునఃప్రారంభం

అప్పుడు అగ్గి మొదలైంది

నిజానికి మోదీ-కేసీఆర్ మధ్య బంధం ఇటీవలి వరకు బాగానే ఉండేది. అయితే, లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి రావడం, ఆమెను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరగడంతో కేంద్రంతో కేసీఆర్ సంబంధాలు దెబ్బతిన్నట్టు ప్రచారం జరిగింది. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా బీఆర్ఎస్ నేతలు మోదీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. మోదీ పర్యటన ఖరారైన తర్వాత మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహా అందరూ ప్రధానిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

TTD Rush: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు... స్వామివారి సర్వదర్శనానికి 30 గంటల సమయం.. సర్వదర్శన టోకెన్ల జారీ రద్దు చేసిన టీటీడీ

మోదీ పర్యటన ఇలా..

  • మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ
  • అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ లో మహబూబ్‌నగర్‌ కు
  • 2.10 గంటలకు మహబూబ్‌నగర్ హెలిప్యాడ్ వద్దకు ప్రధాని
  • 2.15 నుంచి 2.50 వరకు మహబూబ్‌నగర్‌ లో వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు
  • 3 గంటలకు బహిరంగసభ వేదిక వద్దకు
  • 4 గంటల వరకు బహిరంగ సభ వద్దే ప్రధాని
  • 4.10 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి హెలికాప్టర్‌లో  శంషాబాద్‌ కు పయనం
  • 4.45 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న మోదీ
  • 4.50 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement