CM KCR Press Meet: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన, రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటన

కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని, ఎలాంటి ప్రణాళికలు లేకుండా ముందుకు పోతోందని ప్రెస్ మీట్‌లో సీఎం కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

CM KCR Meeting (Photo-TS CMO)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని, ఎలాంటి ప్రణాళికలు లేకుండా ముందుకు పోతోందని ప్రెస్ మీట్‌లో సీఎం కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్ కాట్ చేయటం ద్వారా.. ప్రజాస్వామ్య దేశంలో కేంద్రం వైఖరిపై నిరసన తెలియజేయడానికి దీనిని ఉత్తమైన మార్గంగా భావిస్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. బహిరంగ లేఖ ద్వారా ప్రధాని మోదీకి తనన నిరసనను నేరుగా తెలియజేయనున్నట్టుగా తెలిపారు.

‘నాకు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎంతో గౌరవం ఉండేది. దేశ అభివృద్ధి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రణాళికలపై విశ్లేషణ జరిగేది. ప్రజాధనం ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని గతంలో పీపీఏపీ కమిటీ ఏర్పాటు చేశారు. హరిత విప్లవం అనే ఉద్యమం నెహ్రూ కాలంలో వచ్చింది. అప్పట్లో మంచి సలహాలు, సూచనలు చేస్తే ప్రధానులు స్వీకరించి అమలు చేసే వాళ్ళు. కానీ ఇప్పటి ప్రధానులు అలా లేరు.

ఎస్ కె డే ఇచ్చిన సలహాలు, సూచనలు నెహ్రూ స్వీకరించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నెహ్రూ చేసిన అభివృద్ధి చూసి ఎస్ కె డే ఇండియా వచ్చారు. ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, ప్రణాళికలు నెహ్రూ కాలంలో జరిగాయి. 2014లో మోడీ రాగానే నీతి ఆయోగ్ అని తెచ్చారు. నీతి ఆయోగ్ తెచ్చిన్నపుడు దేశానికి మంచి రోజులు వచ్చాయి అనుకున్నా. నీతి ఆయోగ్‎ ను టీం ఇండియా అని సంబోధించారు. దేశంలోని ముఖ్యమంత్రులందరూ కలిసి దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవడం దీని ఉద్దేశం.



సంబంధిత వార్తలు

Smuggling Ration Rice in Kakinada: బియ్యం దేశం దాటి వెళ్తుంటే ఏం చేస్తున్నారు ? కాకినాడ పోర్టులో టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్

Cyclone Fengal Alert: ఫెంగల్ తుఫానుతో వణుకుతున్న తమిళనాడు, ఏపీలో కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక, ప్రస్తుతం సైక్లోన్ ఎక్కడ ఉందంటే..

Cyclone Fengal Live Tracker: రానున్న 3 గంటల్లో ఫెంగల్ తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం, ఉత్తర వాయువ్య దిశగా కదిలిన తీవ్ర అల్పపీడనం

Harishrao: కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు..దొంగలను తిరిగి పార్టీలోకి చేర్చుకోమన్న హరీశ్ రావు...కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరం కాదు..టీడీపీతో కూడా జై తెలంగాణ అనిపించామన్న హరీశ్