Corona Panic at Pragati Bhavan: సీఎం కేసీఆర్ ఆఫీసులో కరోనా కలకలం, ప్రగతిభవన్‌లో పనిచేస్తున్న 5మంది పోలీసులకు కోవిడ్-19 అంటూ వార్తలు, ఇంకా అధికారికంగా నిర్ధారించని ప్రభుత్వం

తెలంగాణాలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కరోనా ను కట్టడి చేయడానికై కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినప్పటికీ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో మరీ ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో 70నుండి 80శాతం వరకు హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో (pragati bhavan) కరోనా కలకలం సృష్టిస్తోంది.

Coronavirus Outbreak (Photo Credits: IANS)

Hyderabad, July 3: తెలంగాణాలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కరోనా ను కట్టడి చేయడానికై కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినప్పటికీ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో మరీ ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో 70నుండి 80శాతం వరకు హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో (pragati bhavan) కరోనా కలకలం సృష్టిస్తోంది. తెలంగాణలో కరోనా విశ్వరూపం, ఒక్కరోజులోనే అత్యధికంగా 1200 పైగా మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ, 26 జిల్లాల నుంచి నమోదైన పాజిటివ్ కేసులు

అందులో పనిచేసే ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ (Corona Panic at Pragati Bhavan) వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో వెంటనే రంగంలోకి దిగిన వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రగతి భవన్ మొత్తం శానిటైజేషన్ చేపట్టినట్లుగా తెలుస్తోంది. కాగా ముఖ్యమంత్రి ( CM KCR) గత నాలుగురోజుల నుండి గజ్వెల్ లోని ఆయన నివాసంలోనే ఉంటున్నారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రగతి భవన్‌లో భద్రత కోసం వచ్చిన నల్గొండ బెటాలియన్ పోలీసులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.

ప్రగతి భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ప్రగతి భవన్‌లోనే ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసినట్లు సమాచారం. తెలంగాణలో మొత్తం 1213 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (Coronavirus Outbreak in Telangana) 18,570కు చేరుకుంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే పెద్ద ఎత్తున 998 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో ఉంది. అక్కడ 54 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 48 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో ఖమ్మం జిల్లా ఉంది. ఇక్కడ 18 కేసులు నమోదయ్యాయి. గురువారం మరో ఎనిమిది మంది కరోనాకు బలి కాగా, మొత్తం సంఖ్య 275కి చేరింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement