Rave Party Busted in Hyderabad: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం, రేవ్‌ పార్టీలో పట్టుబడ్డ సినీ నిర్మాత, దాడుల్లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌, దొరికినవారిలో పలువురు టాలీవుడ్ ఆర్టిస్టులు

హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌పార్టీని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Rave Party Busted in Hyderabad (PIC@ Pixbay)

Hyderabad, AUG 31: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం రేపింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌పార్టీని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురిని అధికారులు అరెస్టు (Tollywood Celebrities) చేశారు. వీరిలో సినీ నిర్మాత వెంకట్‌తో (Venkat) పాటు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు,  పలువురు యువతులు ఉన్నట్లు సమాచారం.

Telangana Shocker: రాత్రి ఇంట్లో మద్యం సీసాలు, అక్క అనుమానాస్పద మృతి, తెల్లారేసరికి ప్రియుడితో చెల్లెలు పరార్, మిస్టరీగా మారిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి 

అరెస్టయిన వారిని మాధాపూర్ పోలీసులకు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అప్పగించారు. రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలను సేకరించే పనిలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నిమగ్నమయ్యారు. వీరికి డ్రగ్స్ ఎలా వచ్చింది. ఎవరు సరఫరా చేశారు అనే కోణంలో కూపీలాడుతున్నారు. అంతేకాక, అపార్ట్ మెంట్‌లో నిర్వహించిన రేవ్ పార్టీలో (Rave party) అరెస్టయిన వారితో పాటు మరెవరైనా దాడులకు ముందు పాల్గొన్నారా? అనే కోణంలోనూ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Andhra Pradesh: దారుణం, పుల్లుగా తాగి స్వామి వివేకానంద విగ్రహాన్ని కర్రతో కొట్టి, ఉమ్మేస్తూ బూతులు తిడుతూ దాడి చేసిన యువకుడు, వీడియో ఇదిగో.. 

ఇదిలాఉంటే ఇటీవల టాలీవుడ్‌లో నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరిని (KP chowdary) పోలీసులు విచారించగా.. పలువురి టాలీవుడ్ ఆర్టిస్టుల పేర్లు ప్రస్తావించారు. అయితే, కేపీ చౌదరితో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న వారు తమకు ఎలాంటి సంబంధం లేదంటూ సోషల్ మీడియా వేదికల ద్వారా వివరణ ఇచ్చారు. టాలీవుడ్‌కు డ్రగ్స్ కేసులు కొత్త కాదు.. గతంలో చాలా మంది సినీ ప్రముఖులు ఇలాంటి డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు సిట్ విచారణకుసైతం హాజరయ్యారు. ఇటీవల కేపీ చౌదరి వ్యవహారంతో టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపగా.. తాజాగా నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్‌ను గుర్తించడంతో పాటు పలువురు సినీ ప్రముఖులను అరెస్టు చేయడం సినీ ఇండస్ట్రీలో మరోసారి కలకలం సృష్టించింది.



సంబంధిత వార్తలు

Tollywood Film Industry: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ