Viral Video: విషాదం వెంట మరో ప్రమాదం.. తాటి చెట్టుకు ఉరి వేసుకొని గీత కార్మికుడి ఆత్మహత్య.. మృతదేహాన్ని దించుతుండగా పట్టుతప్పి కిందనున్న వ్యక్తిపై పడ్డ డెడ్ బాడీ.. తర్వాత ఏమైంది..? (వీడియో)

తాటి చెట్టుకు ఉరి వేసుకొని ఓ గీత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని డెడ్ బాడీని చెట్టు నుంచి కిందకు దించుతున్న సమయంలో పట్టుతప్పిన ఆ మృతదేహం కిందనున్న వ్యక్తిపై పడింది.

falling deadbody

Nalgonda, Aug 3: తాటి చెట్టుకు (Palm Tree) ఉరి వేసుకొని ఓ గీత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని డెడ్ బాడీని (Dead Body) చెట్టు నుంచి కిందకు దించుతున్న సమయంలో పట్టుతప్పిన ఆ మృతదేహం కిందనున్న వ్యక్తిపై పడింది. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది.  పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో దేశగాని వెంకటేశం (80) కల్లు గీస్తూ జీవిస్తున్నాడు. పిల్లలు లేకపోవడంతో భార్యభర్తలు ఇద్దరే ఉంటున్నారు. భార్యకు మతిస్థితిమితం లేకపోవడంతో ఆమె బాగోగులు చూసుకోవడంతో పాటు, ఇంటి పనులు సైతం చేసుకోవాల్సి రావడంతో మానసికంగా కుంగిపోయాడు. దీంతో శుక్రవారం తాటిచెట్టు ఎక్కి అక్కడే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

బిర్యానీలో బొద్దింక దర్శనం.. హైదరాబాద్ పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్‌ లో ఘటన (వీడియో)

మృతదేహం మీద పడడంతో..

వెంకటేశం డెడ్ బాడీని కిందకు దించేందుకు ఓ వ్యక్తి తాటి చెట్టు ఎక్కాడు. మరోవ్యక్తి అతనికి సాయంగా ఉండటానికి చెట్టు ఎక్కుతుండగా మృతదేహం అతడిపై పడడంతో కిందపడి గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి చందన.. సీఎం చంద్రబాబు అభినందనలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement