Cockroach Found in Biryani

Hyderabad, Aug 3: ఆహార నాణ్యత (Food Quality), శుభ్రత విషయంలో హైదరాబాద్ హోటల్స్ (Hyderabad Hotels) ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే, ప్రఖ్యాత హోటల్స్ లో మురిగిపోయిన, పురుగులు పడిన ఆహారాన్ని వడ్డించిన ఉదంతాలు బయటపడిన వేళ.. తాజాగా పంజాగుట్ట  మెరిడియన్ రెస్టారెంట్‌ లో వడ్డించిన ఓ బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది. దీన్ని గమనించిన కస్టమర్ యాజమాన్యం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. అయితే, హోటల్ ఓనర్ దీనిపై నిర్లక్ష్యం వహించినట్టు బాధితుడు మండిపడ్డాడు.

మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి చందన.. సీఎం చంద్రబాబు అభినందనలు

ఫుడ్ సేఫ్టీ అధికారులకు కస్టమర్ విజ్ఞప్తి

చిరాకెత్తిన బాధితుడు.. బిర్యానీలో బొద్దింక పడిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రమాణాలు పాటించని మెరిడియన్ రెస్టారెంట్‌ పై చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు కస్టమర్ విజ్ఞప్తి చేశాడు.

తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకటన, పూర్తి వివరాలివే, చివరి రోజు కీలక బిల్లులకు అమోదం,అసెంబ్లీలో బూతులు మాట్లాడిన దానం నాగేందర్