GHMC Announces One Time Scheme: ఇంటిపన్ను బాకీ ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్, ఏకంగా 90 శాతం వడ్డీ మాఫీ ఆఫర్‌ ఇచ్చిన జీహెచ్‌ఎంసీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 90 శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు (Pending Tax) చెల్లించేలా మరోసారి ఓటీఎస్‌ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

GHMC Announces One Time Scheme

Hyderabad, March 07: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 90 శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు (Pending Tax) చెల్లించేలా మరోసారి ఓటీఎస్‌ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓటీఎస్ (OTS) పథకాన్ని ఉపయోగించుకొని నగరంలోని ఆస్తి పన్ను మొండి బకాయిలున్న వారు పన్ను చెల్లించాలని సూచించారు.

Telangana: ప్రజాభవన్‌లో ఆల్‌ పార్టీ ఎంపీల సమావేశం.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానం, కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా  

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటీఎస్‌లో మొత్తం పన్నుతోపాటు వడ్డీ 10 శాతం చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు. గతేడాది ప్రవేశపెట్టిన ఓటీఎస్ వల్ల సుమారు లక్ష మంది వినియోగదారులు ఆస్తి పన్ను చెల్లించారు. జీహెచ్‌ఎంసీ.. ఈ సారి ఆస్తి పన్నుకు సంబంధించి రూ.2 వేల కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఓటీఎస్‌కు అంగీకరించడంతో ఆశించిన స్థాయిలో పన్నులు వసూలవుతాయని భావిస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement