Hyderabad Shocker: తార్నాకలో కామాంధుడు, లిఫ్ట్ పేరుతో యువతికి లైంగిక వేధింపులు. బైక్ మీద నుంచి దూకడంతో యువతికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌ నగరంలో తార్నాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్‌ ఇచ్చే వంకతో ఓ కామాంధుడు.. ఓ యువతిపై నడిరోడ్డుపై అదీ బైక్‌ మీద అఘాయిత్యానికి ప్రయత్నించగా.. తప్పించుకునే క్రమంలో ఆమె ప్రాణం మీదకు తెచ్చుకుంది.

Representational (Credits: Google)

Hyd, july 3: హైదరాబాద్‌ నగరంలో తార్నాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్‌ ఇచ్చే వంకతో ఓ కామాంధుడు.. ఓ యువతిపై నడిరోడ్డుపై అదీ బైక్‌ మీద అఘాయిత్యానికి ప్రయత్నించగా.. తప్పించుకునే క్రమంలో ఆమె ప్రాణం మీదకు తెచ్చుకుంది.

ప్రియురాలి మోజులో భార్యపై దారుణం, కత్తితో ఆమె ముక్కు కోసి జేబులో పెట్టుకుని పరారయిన కసాయి భర్త, నిందితుడు అరెస్ట్..

తార్నక వద్ద లిఫ్ట్‌ ఇచ్చే వంకతో బైక్‌పై ఎక్కించుకుని లైంగిక దాడికి యత్నించారు. అయితే.. తప్పించుకునేక్రమంలో బైక్‌పై నుంచి దూకేసింది సదరు యువతి. అదే సమయంలో వెనక నుంచి లారీ దూసుకురావడంతో.. దాని కిందకు వెళ్లింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పేరు ఆర్తిగా గుర్తించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement