Telangana Rains Update: తెలంగాణ మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు.. ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌.. హైదరాబాద్‌ కు ఎల్లో అలర్ట్

తెలంగాణలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజు మినహాయిస్తే, గత ఏడు రోజులుగా వరుణదేవుడు రాష్ట్రవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపించాడు.

Rains (Representational Image) (Source-Google)

Hyderabad, July 27: తెలంగాణలో (Telangana) వారం రోజులుగా విస్తారంగా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజు మినహాయిస్తే, గత ఏడు రోజులుగా వరుణదేవుడు రాష్ట్రవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మరోసారి రాష్ట్రానికి వర్షం హెచ్చరికలు జారీచేసింది. వచ్చే నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

అట్టహాసంగా ఒలింపిక్స్‌ ప్రారంభం.. ప్రత్యేక ఆకర్షణగా భారత్.. ఫ్లాగ్ బేరర్స్‌ గా కనువిందు చేసిన టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

ఈ జిల్లాకు రెడ్‌ అలర్ట్‌

ముఖ్యంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మెదక్‌ లో ఈదురుగాలలతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ తో పాటు మరికొన్ని జిల్లాలకు ఎల్లోఅలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత గడిచిన 24 గంటల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లిలో అత్యధికంగా 5.76 సెం.మీ వర్షపాతం నమోదైంది.

ఒలింపిక్స్ అథ్లెట్ల కోసం 2 లక్షల ఉచిత కండోమ్‌లు, యాంటీ సెక్స్ బెడ్స్ ఏర్పాటు చేసినా శృంగారం కోసం తపిస్తున్న ఆటగాళ్లు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement