MMTS Trains Cancelled: అలర్ట్ న్యూస్, నేడు 19 ఎంఎంటీఎస్‌ల రద్దు, పనిదినాల్లో సర్వీసుల రద్దుపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు, రద్దయిన రైళ్ల జాబితా ఇదే..
వారం రోజులుగా సర్వీసులను రద్దు (MMTS Trains Cancelled) చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలు జారీ చేస్తూనే ఉంది. నేడు మరికొన్ని ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయినట్టు (Cancellation of MMTS Train Services) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది
ఎంఎంటీఎస్ రైలు సర్వీసుల రద్దు కొనసాగుతోంది. వారం రోజులుగా సర్వీసులను రద్దు (MMTS Trains Cancelled) చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలు జారీ చేస్తూనే ఉంది. నేడు మరికొన్ని ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయినట్టు (Cancellation of MMTS Train Services) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వారం రోజులుగా రైల్వే శాఖ పలు సర్వీసులను రద్దు చేస్తూ వస్తోంది. అయితే.. పని దినాల్లోనూ సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో శని, ఆదివారాల్లో రద్దు చేస్తే.. ఇప్పుడు పనిదినాల్లో కూడా రద్దు చేస్తూ, నగర ప్రయాణికులకు తక్కువ టిక్కెట్ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటును దూరం చేస్తోంది. సోమవారం 19 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది. చౌకధరకు అందుబాటులో ఉండే రవాణా సదుపాయం దూరమైందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సోమవారం 19 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్టు రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్ల జాబితా ఇదే..
• లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లేవి
• హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లేవి 3
• ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లేవి 5
• లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లేవి 6
• రామచంద్రాపురం - ఫలక్‌నుమా మధ్య 2
• ఫలక్‌నుమా నుంచి హైదరాబాద్ వెళ్లేది 1