
ప్రతికూల ప్రపంచ సూచనల ఫలితంగా సోమవారం బంగారం ధర రెడ్‌లో (Gold Price) ట్రేడవుతుండగా, వెండి రేటు 1.24% తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో, బంగారం ఏప్రిల్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.125 లేదా 0.23% తగ్గి రూ.55,307 వద్ద ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ రూ.798 తగ్గి కిలో రూ.63,734 వద్ద ట్రేడవుతున్నాయి.
ఈ నెలలో ఇప్పటికే బంగారం ధర రూ. 2 వేల వరకు తగ్గింది. దీంతో మధ్య తరగతి ప్రజల్లో ఆనందం నెలకొంది. రాబోయే రోజుల్లో మళ్లీ ధరలు పెరుగుతాయేమో అనే ఆలోచనతో ఇప్పుడు బంగారం కొనేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,180గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,500 గా ఉంది. విశాఖ, విజయవాడలో కూడా ఇదే ధర ఉంది. కిలో వెండి ధర రూ. 70 వేలుగా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలలో కిలో వెండి ధర రూ. 67,500గా ఉంది.
కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే వీసాకు దరఖాస్తు.. విద్యార్థులకు ఉపయోగకరంగా అమెరికా నూతన వీసా విధానం
రాయిటర్స్ ప్రకారం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఫెడరల్ రిజర్వ్ మరిన్ని వడ్డీరేట్ల పెంపును అమలు చేస్తుందనే భయాలను బలమైన U.S. ఆర్థిక డేటా రేకెత్తించిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా, బంగారం ధరలు ఫ్లాట్‌గా ఉన్నాయి. సోమవారం రెండు నెలల కనిష్టానికి (Gold, silver slip to multi-month lows) చేరాయి. స్పాట్ బంగారం ఔన్సుకు $1,810.48 వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంది. U.S. గోల్డ్ ఫ్యూచర్స్ $1,817.40 వద్ద ఫ్లాట్‌గా ఉన్నాయి.