Man Obscene Behaviour In Public Place: అమ్మాయిల ముందు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. సికింద్రాబాద్ - రేతిఫిల్ బస్టాప్‌ లో ఘటన (వీడియో వైరల్)

రద్దీ ప్రదేశాల్లో ఆకతాయిలు కొందరు అమ్మాయిలను వేధించడం నానాటికీ పెరిగిపోతుంది. ఎన్నిసార్లు చితక్కొట్టినా, ఎన్ని రకాలుగా హెచ్చరించినా వీళ్లలో అస్సలు మార్పు కానరావడం లేదు. ఇదీ అలాంటి ఘటనే.

Man Obscene Behaviour In Public Place (Credits: X)

Hyderabad, Mar 8: రద్దీ ప్రదేశాల్లో ఆకతాయిలు కొందరు అమ్మాయిలను వేధించడం నానాటికీ పెరిగిపోతుంది. ఎన్నిసార్లు చితక్కొట్టినా, ఎన్ని రకాలుగా హెచ్చరించినా వీళ్లలో అస్సలు మార్పు కానరావడం లేదు. ఇదీ అలాంటి ఘటనే. హైదరాబాద్ (Hyderabad) లోని సికింద్రాబాద్ - రేతిఫిల్ బస్టాప్‌ లో శుక్రవారం ఉదయం దారుణం జరిగింది. ఉదయం సమయంలో అమ్మాయిల ముందు ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు (Man Obscene Behaviour In Public Place). సదరు వ్యక్తి ప్రవర్తనను చూసి కాలేజీలకు, స్కూల్స్ కు వెళ్లే అమ్మాయిలు ఒకింత భయపడ్డారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.  దీంతో ఆ వీడియో పోలీసుల దృష్టికి చేరడంతో సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోన్నట్టు సమాచారం.

టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?

Here's Video:

చిర్రెత్తికొచ్చి.. చితక్కొట్టి

ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని కాన్పూర్‌ లోని బెకన్‌ గంజ్ మార్కెట్‌ లో కూడా వారం కిందట ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. బిజీ మార్కెట్లో బుర్ఖా ధరించిన మహిళ పండ్ల దుకాణం వద్ద నిలబడి ఉండటం సదరు వీడియోలో కనిపిస్తుంది. ఇంతలో ఆమె వెనుకగా వచ్చిన ఓ వ్యక్తి ఆమెను అనుచితంగా తాకేందుకు యత్నించాడు. దీంతో ఆ మహిళ పట్టరాని కోపంతో ఆ వ్యక్తి కాలర్ పట్టుకుని చెంపపై వాయించడం కనిపిస్తుంది. ఇలా కేవలం 48 సెకన్లలోనే ఏకంగా 14 సార్లు చెంపదెబ్బలు కొట్టింది. అయితే ఆమె కొట్టే దెబ్బలు తట్టుకోలేక మార్కెట్లో చోద్యం చూస్తున్న వారిని సాయం కోరగా.. ఎవరూ స్పందించలేదు. దీంతో ఆ మహిళ కింద పడేసి చితక్కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. సదరు వ్యక్తి మార్కెట్‌ లో మహిళలను తరచూ వేధిస్తున్నాడని స్థానికులు పలువురు తెలిపారు.

లక్షమందితో బీఆర్ఎస్‌ భారీ బహిరంగ సభ, రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచన

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement