Ravi Teja Shot Dead In US: అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు, కుప్పకూలి అక్కడే మృతి చెందిన రవితేజ, మరణ వార్త విని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

US అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది.దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్​కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్​ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు.

Indian student Raviteja from Hyderabad shot dead in U.S. (Photo-X/Telugu scribe)

US అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది.దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్​కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్​ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు. అతడి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీలైనంత త్వరగా తన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి రప్పించాల్సిందిగా అధికారులను తండ్రి కోరాడు.

అమెరికాలో కాల్పుల ఘటనలో మరో తెలుగు విద్యార్థి బలి, హైదరాబాద్​ యువకుడు రవితేజపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు

కాగా 2022 మార్చిలో అమెరికా వెళ్లిన రవితేజ మాస్టర్స్​ పూర్తి చేసి అక్కడ ఉద్యోగం వెతుక్కుంటున్నాడు.ఈ క్రమంలో అమెరికాలోని వాషింగ్టన్‌ ఏస్‌లో గత రాత్రి ఒక్కసారిగా యువకుడిపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన రవితేజ ఘటనా స్థలంలోని ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందిన వెంటనే అక్కడి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. రవితేజ మృతి సమాచారాన్ని హైదరాబాద్‌లోని కుటుంబసభ్యులకు తెలియజేశారు. రవితేజ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement