Hyderabad: ట‌కీలా ప‌బ్‌ దాడి మరవక ముందే.. మరో పబ్‌పై దాడి చేసిన పోలీసులు, బసేరా హోటల్‌లోని పబ్‌లో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు, పలువురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు

గరంలోని బసేరా హోటల్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు (North Zone Task Force Police) సికింద్రాబాద్‌లోని (Secunderabad) బసేరా హోటల్‌లోని పబ్‌పై దాడులు జరిపారు.

Rave party | Image used for representational purpose (Photo Credits: Pixabay)

Hyd, May 31: నగరంలోని బసేరా హోటల్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు (North Zone Task Force Police) సికింద్రాబాద్‌లోని (Secunderabad) బసేరా హోటల్‌లోని పబ్‌పై దాడులు జరిపారు. రైడ్స్‌లో భాగంగా 10 మంది యువతులు, 25 మంది కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని గోపాలపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇటీవల రాంగోపాల్‌పేట పోలీసులు టకీలా పబ్‌పై పోలీసులు దాడి చేసిన ఘటన మరవక ముందే బసేరా హోటల్‌లోని ఔట్ స్వింగర్స్ పబ్‌పై దాడి చేసి యువతులు, యువకులను అదుపులోకి తీసుకోవడం విశేషం.

గత శ‌నివారం రాత్రి సికింద్రాబాద్ ప‌రిధిలోని రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న ట‌కీలా ప‌బ్‌లో క్యాబ‌రే డ్యాన్సులు క‌నిపించాయి. మ‌ద్యం మ‌త్తులో తూగుతున్న మందుబాబులను మ‌రింత‌గా హుషారెత్తించేందుకు ప‌బ్ యాజ‌మాన్యం యువ‌తుల‌తో నృత్యాల‌ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా అర్ధ రాత్రి దాటినా కూడా ప‌బ్‌ను కొన‌సాగిస్తూ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించింది.

కర్ణాటకలో మళ్లీ టెన్సన్, హిందూ ఆలయంలో విగ్రహాలు ధ్వంసం, విగ్రహాలను పగలగొట్టేందుకు రాడ్లు, ఇతర సామగ్రిని ఉపయోగించిన దుండగులు, మండిపడుతున్న హిందూ కార్యకర్తలు

ఈ ప‌బ్ వ్య‌వ‌హారంపై స‌మాచారం అందుకున్న హైద‌రాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ట‌కీలా ప‌బ్‌పై శ‌నివారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత దాడులు చేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప‌బ్‌ను నిర్వ‌హిస్తున్నార‌ని తేల్చిన పోలీసులు ప‌బ్‌ను సీజ్ చేశారు. ప‌బ్‌లో క్యాబ‌రే డ్యాన్స్ ఏర్పాటు చేసిన వైనాన్ని గుర్తించిన పోలీసులు మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement