IPL Auction 2025 Live

Minister Thalassani: సినిమా సమస్యలపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడతా, తెలంగాణ మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు, సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా ఉండాలని తెలిపిన మంత్రి

ఏపీలోని సినిమా థియేట‌ర్ల స‌మ‌స్య‌ల‌పై (I will talk to AP ministers on the issue of theaters) ఆ రాష్ట్ర మంత్రుల‌తో తాను మాట్లాడ‌తాన‌ని తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Telangana Minister Talasani Srinivas Yadav (photo-ANI)

Hyd, Jan 12: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌లు త‌గ్గించ‌డంపై వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై సినీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌తో ఏపీ మంత్రి పేర్ని నాని చ‌ర్చ‌లు జ‌రిపిన‌ప్ప‌టికీ అవి ఫ‌లించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఏపీలోని సినిమా థియేట‌ర్ల స‌మ‌స్య‌ల‌పై (I will talk to AP ministers on the issue of theaters) ఆ రాష్ట్ర మంత్రుల‌తో తాను మాట్లాడ‌తాన‌ని తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణలో టికెట్ ధరలు పెంచామని.. ఐదో ఆటకు అనుమతి ఇచ్చామన్నారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తలసాని (Telangana Minister Thalassani) పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు. సినిమాకు కులం మతం ప్రాంతాలు ఉండవన్నారు. థియేట‌ర్ల‌లో ఐదో ఆటకు అనుమతులు కూడా ఇచ్చామ‌ని చెప్పారు.

జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్, బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు, బీహార్‌ విపక్ష నేత తేజస్వియాదవ్‌‌తో ప్రగతి భవన్‌లో భేటీ

సినిమా ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమన్నారు. సినీ పరిశ్రమలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుందని తలసాని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదని.. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని తలసాని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది బ‌తుకుతున్నార‌ని, ఇక్కడి ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తాము సాధార‌ణంగా సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు పెట్ట‌బోమ‌ని తలసాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అన్నారు. అయితే, క‌రోనా స‌మ‌యంలో మాత్రం ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉంటే ప‌లు నిబంధ‌న‌లు త‌ప్ప‌వ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే ఆన్‌లైన్ టికెట్ పోర్ట‌ల్‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తలసాని శ్రీ‌నివాస్ యాద‌వ్ తెలిపారు.