Pawan Kalyan Tribute to Ramoji Rao: ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత క‌లుద్దామ‌నుకున్నా.. కానీ ఇంత‌లోనే ఇలా! రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్

అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Cherukuri Ramoji Rao

Hyderabad, June 08: రామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘రామోజీరావు మరణ వార్త చాలా దిగ్భ్రాంతి కలిగించింది. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయన్ను కలుద్దామనుకున్నా. కానీ, ఇంతలోనే దురదృష్టవశాత్తూ కన్నుమూశారు.

 

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్‌ నుంచి వచ్చిన వారే. ఎంతో మంది జర్నలిస్టులను అందించిన మహానుభావులు ఆయన. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో చేశారు. అత్యున్నత ప్రమాణాలతో గొప్ప ఫిల్మ్‌సిటీని నిర్మించారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలి. జనసేన తరఫున సంతాపం తెలియజేస్తున్నా’’ అని పవన్‌ కల్యాణ్ అన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif