Kaleshwaram Water: పల్లెపల్లెకు గోదావరి జలాలు.. వర్షాకాలం నాటికే రిజర్వాయర్‌లోకి కాళేశ్వరం నీరు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామన్న ట్రాన్స్‌కో సీఎండీ

సీఎం కేసీఆర్ స్వయంగా ట్రాన్స్ కో సిఎండితో ఫోన్లో మాట్లాడారు, కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించేందుకు జరుగుతున్న లిఫ్టు పనులపై సీఎం ఆరాతీశారు. ఇందుకోసం విద్యుత్ శాఖ చేస్తున్న ఏర్పాట్ల పట్ల సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు, వీలైనంత త్వరగా లిఫ్టులన్నీ సిద్ధం చేయాలని కోరారు.....

File Image of CM KCR Inspecting Kaleshwaram Lift Irrigation Project. | File Photo

Hyderabad, April 24:  కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం రంగనాయక సాగర్ వరకు వస్తున్న గోదావరి జలాలను ఈ వానాకాలంలోనే కొండ పోచమ్మ సాగర్ వరకు తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామని ట్రాన్స్ కో సీఎండి ప్రభాకర్ రావు, ముఖ్యమంత్రికి నివేదించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అక్కారం, మర్కూక్ పంపుహౌజుల పనులను ట్రాన్స్ కో సీఎండి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందికి తగు సూచనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి జరగుకుండా అన్ని నియమాలు పాటించాలని, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని సూచించారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ స్వయంగా ట్రాన్స్ కో సిఎండితో ఫోన్లో మాట్లాడారు, కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించేందుకు జరుగుతున్న లిఫ్టు పనులపై సీఎం ఆరాతీశారు. ఇందుకోసం విద్యుత్ శాఖ చేస్తున్న ఏర్పాట్ల పట్ల సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు, వీలైనంత త్వరగా లిఫ్టులన్నీ సిద్ధం చేయాలని కోరారు, ఈ సందర్భంగా విద్యుత్ శాఖ చేస్తున్న కృషిని సీఎం కేసీఆర్ ప్రశంసించారు.  తెలంగాణలో 970కి చేరిన కోవిడ్-19 కేసులు, మరో నాలుగు రోజుల్లో వైరస్ కట్టడి అవుతుందన్న మంత్రి ఈటల

ఇక సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని లిఫ్టులను నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తామని ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు ప్రకటించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఈ వానాకాలంలోనే కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కు తరలించే దిశగా అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

‘‘ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నీరు రంగనాయక్ సాగర్ వరకు విజయవంతంగా చేరుకుంది. అక్కడి నుంచి మల్లన్న సాగర్ కు, తర్వాత కొండ పోచమ్మ సాగర్ కు నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన లిఫ్టులను విద్యుత్ శాఖ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తుంది. అక్కారంలో 162 మెగావాట్ల సామర్థ్యం (6x27) కలిగిన పంపుసెట్లు సిద్ధంగా ఉన్నాయి. అక్కడి నుంచి నీరు మర్కూక్ చేరుకుంటుంది. మర్కూక్ నుంచి నీటిని ఎత్తిపోయడానికి 204 మెగావాట్ల సామర్థ్యం (6x34) కలిగిన పంపులు సిద్దమయ్యాయి. నాలుగు బృందాలు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. టెస్టింగ్ పూర్తి చేసి, నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తాం’’ అని ట్రాన్స్ కో సీఎండి చెప్పారు.

మరోవైపు పంపుహౌజుల కేబుల్ పనులు చేసే నిపుణుల బృందం లాక్ డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకుపోయింది. వారు వస్తే తప్ప ఇక్కడ పనులు జరిగే అవకాశం లేకపోవడంతో ట్రాన్స్ కో సిఎండి తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డికి లేఖ రాసి పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డిజిపి, మహారాష్ట్ర డిజిపితో ఫోన్లో మాట్లాడి వారికి ప్రత్యేక అనుమతి ఇప్పించారు. దీంతో ప్రత్యేక అనుమతితో కూడిన వాహనాల్లో నిపుణుల బృందం సిద్దిపేట జిల్లాకు చేరుకుంది.  ప్రస్తుతం వారి ఆధ్వర్యంలో పంపుహౌజుల కేబుల్ పనులు నడుస్తున్నాన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్‌ డోర్‌.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement