Telangana Health Minister Etela Rajender | File Photo

Hyderabad, April 23: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా మరో 27 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ గురువారం ధృవీకరించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి 13 కేసులు ఉండగా, గద్వాల్ నుంచి 10 కేసులు ఉన్నాయి, మిగతా 4 ఇతర జిల్లాల నుంచి నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 970కు చేరుకుందని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రం నుంచి గురువారం మరొక కరోనా మరణం నమోదైంది. దీంతో ఇప్పటివరకు కోవిడ్-19 బారినపడి చనిపోయిన వారి సంఖ్య 25కు చేరింది. ఇక ఈ వ్యాధి నుంచి కోలుకొని ఈరోజు మరో 58 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 262కు పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 693 యాక్టివ్ కేసులున్నాయి, వారందరికీ గాంధీ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. కొందరు మినహాయించి అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది, అయితే ఎవరూ కూడా వెంటిలెటర్ మీద లేరని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది, ప్రజలు ఇలాగే సహకరించాలని కోరిన సీఎం కేసీఆర్

Watch HM's Press Meet Here:

" రాష్ట్రవ్యాప్తంగా అన్ని కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ ను పటిష్ఠంగా అమలు చేయడం, వైరస్ నివారణ చర్యలు చేపడుతూ తమ వంతుగా గట్టిగా ప్రయత్నిస్తున్నాము, రాబోయే మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము" అని మంత్రి ఈటల రాజేంధర్ పేర్కొన్నారు.