Wine Shops to Closed in Telangana: మందుబాబులకు అలర్ట్, రేపటి నుండి 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేత, ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు

తెలంగాణలో రేపటి నుండి మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తెలంగాణలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి

Wine Shops (Credits: Pixbay)

Hyd, Feb 24: తెలంగాణలో రేపటి నుండి మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తెలంగాణలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే తేదీతో పాటు, ముందుగా రెండు రోజులు కూడా మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ క్రమంలో రేపటి నుండి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలు తెరుచుకోవని (Wine Shops to Closed in Telangana) ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుండి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి, పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement