రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది. మార్చి 29 నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి.అశోక్‌బాబు, తిరుమలనాయుడు, దువ్వారపు రామారావు పదవీకాలం ముగియనుంది. తెలంగాణలో పదవీకాలం ముగిసే వారిలో మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్‌ హాసన్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. సంఖ్యాపరంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నాలుగు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తుని మున్సిపల్ ఛైర్‌ పర్సన్‌ పదవికి వైసీపీ నేత రాజీనామా, కౌన్సిలర్‌గా కొనసాగుతానని ప్రకటించిన సుధారాణి

ముఖ్యమైన తేదీలు

ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ: మార్చి 3

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం: మార్చి 10

నామినేషన్ల పరిశీలన: మార్చి 11

నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 13

పోలింగ్‌: మార్చి 20 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

ఓట్ల లెక్కింపు: మార్చి 20 (పోలింగ్‌ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి)

ECI releases schedule for MLA quota MLC elections in two Telugu states

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)