కాకినాడ జిల్లా తునిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ తగిలింది. ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సుధారాణి ప్రకటించారు. చైర్‌ పర్సన్‌గా మాత్రమే రాజీనామా చేశానని కౌన్సిలర్‌గా కొనసాగుతానని ఆమె వెల్లడించారు. సుధారాణి నిర్వహించిన భేటీకి 14 మంది వైసీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే, తమకు 17 మంది కౌన్సిలర్ల మద్దతు ఉందని వైసీపీ ప్రకటించింది.ఈ నేపథ్యంలోనే పలువురు కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కోరం లేక నాలుగుసార్లు తుని ఉపాధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. మరోసారి ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తు్న్నారు.

తుని మున్సిపల్‌ వైఎస్‌ ఛైర్మన్‌ ఎన్నిక నాలుగోసారి వాయిదా, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై దాడి వీడియోలు వైరల్

YSRCP leader Sudharani resigns from the post of Tuni Municipal Chairperson

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)