Fire Accident in Shadnagar: షాద్‌నగర్ శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు.. 11 మందికి తీవ్ర గాయాలు.. పలువురి పరిస్థితి విషయం (వీడియోతో)
హైదరాబాద్ శివారులోని మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం బూర్గుల సమీపంలో గల శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో పేలుడు సంభవించింది.
Hyderabad, July 17: హైదరాబాద్ (Hyderabad) శివారులోని మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. రంగారెడ్డి జిల్లా (Rangareddy) షాద్ నగర్ (Shadnagar) నియోజకవర్గం బూర్గుల సమీపంలో గల శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో కొందరిని షాద్ నగర్‌లోని కమ్యూనిటీ ఆసుపత్రికి, మిగిలిన వారి గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు తరలించారు. బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంకా అదుపులోకి రాని మంటలు
కంపెనీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రానట్టు తెలుస్తుంది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement