Gussadi Kanakaraju Official last rites by TG Govt.: గుస్సాడీ కనకరాజు మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశం

కనకరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Gussadi Kankaraju Died

Hyderabad, Oct 26: గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ  గుస్సాడీ కనకరాజు (Gussadi Kanakaraju) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనకరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుస్సాడీ కనకరాజుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అంత్యక్రియల కోసం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామంలో శనివారం అంత్యక్రియలు జరుగనున్నాయి. 70 ఏండ్ల వయసులో అనారోగ్యంతో శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

గుస్సాడీ క‌ళాకారుడు క‌న‌క‌రాజు క‌న్నుమూత‌, ఆదివాసీల నృత్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన గొప్ప క‌ళాక‌రుడు, రేపు స్వ‌గ్రామంలో అంత్య‌క్రియ‌లు

గుస్సాడీకి ఎనలేని కీర్తి

అసిఫాబాద్‌లోని ఆదివాసీ బిడ్డల నృత్య రూపకమైన గుస్సాడీకి కనకరాజు ఎనలేని కీర్తిని తెచ్చారు. తమ అస్తిత్వ కళారూపాన్ని ఆయన తరచూ ప్రదర్శిస్తూ భావి తరాలకు తమ ఆచార, సంప్రదాయాలను తెలియజేశారు. దాంతో, ఆయన పేరు గుస్సాడీ కనకరాజుగా స్థిరపడిపోయింది. ఆదివాసీల కళను బతికిస్తూ.. అందులోనే ఆనందాన్ని వెతుక్కున్న ఆయన పేరును అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు సిఫారసు చేసింది. 2021 నవంబర్ 9వ తేదీన అప్పటి రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ చేతుల మీదుగా ఆయన దేశపు నాలుగో అత్యున్నత అవార్డు అయిన పద్మశ్రీని అందుకున్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు.. ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్‌ రావుల పాస్‌ పోర్టు రద్దు



సంబంధిత వార్తలు