IPL Auction 2025 Live

Rashtrapathi To Come Hyderabad Today: నేడు ముచ్చింతల్‌కు హైదరాబాద్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, 120 కిలోల బంగారు రామానుజుల విగ్రహం ఆవిష్కరించనున్న ప్రథమ పౌరుడు

ఈరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలకనున్నారు.

President Ram Nath Kovind. | (Photo Credits: PTI)

హైదరాబాద్: ముచ్చింతల్ లో సమతామూర్తి ఉత్సవాలల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ కు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలకనున్నారు. సమతామూర్తి ఉత్సవాలల్లో పాల్గొని రేపు ఉదయం 10గంటలకు రామ్ నాథ్ కోవింద్ బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢీల్లికి చేరుకోనున్నారు.

ఖబర్ధార్‌ మోదీ.. ఇది తెలంగాణ అడ్డా, నిన్ను తరిమికొట్టేందుకు తెలంగాణ పులిబిడ్డ‌ వస్తున్నాడు, ఏం చేస్కుంటావో చేసుకో. మీ సంస్కరణలను మేం అమలు చేయమని తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్

మరోవైపు రుత్విజుల ఆధ్వర్యంలో యాగశాలల్లో వేదపారాయణం శాస్త్రోక్తంగా సాగుతోంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అయోధ్య, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ స్వాములు హాజరై మహా యాగాన్ని నిర్వహిస్తున్నారు. దేశం నలుమూలల నుంచీ తరలివచ్చిన 5వేలమంది రుత్విజుల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువుతో ముచ్చింతల్ ప్రాంగణం వైభవంగా కనిపిస్తోంది.