Train Timings Change: అలర్ట్...రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు...ఎంఎంటీఎస్ రైళ్ల టైమ్ కూడా మార్పు...పూర్తి వివరాలివే
మారిన ట్రైన్ టైమింగ్స్ నేటి నుండే అమల్లోకి వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు.
Hyd, January 1: నూతన సంవత్సరం సందర్భంగా పలు రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మారిన ట్రైన్ టైమింగ్స్ నేటి నుండే అమల్లోకి వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణ వేళల్లోనూ మార్పులు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను అనుసంధానం చేసేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం ఎంఎంటీఎస్ రైళ్లలో మార్పులు చేసినట్లు తెలిపింది. 2025 సంవత్సరంలో తొలి సూర్యోదయం, చూసేందుకు ఎగబడ్డ జనం.. మీరూ ఆ వీడియోలు చూడండి..
రైళ్లకు సంబంధించిన సమాచారం, సంబంధిత రైల్వే స్టేషన్ల్లో ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ (www.irctc.co.in), నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుందని సూచించింది.
South Central Railway changes Train Timings