CM Revanth Reddy vs Harish Rao: వాటర్ మీద చర్చ జరుగుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా, ఘాటుగా బదులిచ్చిన హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. అంతకుముందు ‘కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు’ పేరుతో నోట్ విడుదల చేసింది.

Chief Minister Revanth reddy and BRS MLA Harish Rao (Photo-File Image)

Hyd, Feb 8: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Sessions 2024) హాట్ హాట్‌గా సాగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. అంతకుముందు ‘కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు’ పేరుతో నోట్ విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య సోమవారం అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం (CM Revanth Reddy vs Harish Rao) జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమని, అలాంటి చర్చ సందర్భంగా అపొజిషన్ పార్టీ లీడర్ కేసీఆర్ సభలో లేకుండా ఫామ్ హౌస్‌లో పడుకున్నారని, కరీంనగర్ ప్రజలు తరిమితే మహబూబ్ నగర్ వచ్చారని ఏద్దేవా చేశారు.

కామారెడ్డిలో ఐసీయూ పేషెంట్‌పై ఎలుకలు దాడి ఘటన, ఇద్దరు వైద్యాధికారులతో సహా నర్సింగ్‌ ఆఫీసర్‌ సస్పెండ్, ఉత్తర్వులు జారీ చేసిన వైద్య శాఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలపై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వళ్ళించడం అవుతుందన్నారు. కోడంగల్ ప్రజలు తరిమితే మల్కాజ్‌గిరి వచ్చారంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనెజ్ మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ) అప్పగించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది.

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌, వయోపరిమితి 44 నుండి 46 ఏళ్లకు పెంపు, జీవో జారీ

13వ తేదీ మంగళవారం రోజున ఛలో నల్లగొండకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆయకట్టు రైతులు, ప్రజలు భారీగా తరలి రావాలని కోరింది. అక్కడ నిర్వహించే సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తారు. అదే రోజు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళతారు. ఒకే రోజు అధికార, విపక్షాలు ప్రాజెక్టుల అంశంపై మాటల యుద్దానికి దిగుతున్నాయి.

కృష్ణా ప్రాజెక్టులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చిన తర్వాత హరీశ్‌రావుకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అవకాశమిచ్చారు. ప్రభుత్వం సత్య దూరమైన ప్రజంటేషన్‌ ఇచ్చిందని హరీశ్‌ ఆరోపించారు.

పీపీటీ కోసం తమకూ అవకాశమివ్వాలని కోరామని.. వాస్తవాలను వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్పీకర్ అవకాశమివ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటన చేయడం తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ విజయమని తెలిపారు.హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాను మోసం చేసినందునే ఎన్నికల్లో ప్రజలు మీ పార్టీని ఓడించారని చెప్పారు.

ఏపీ అసెంబ్లీలో జగన్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ వినలేదా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చెప్పిన తర్వాత కూడా తామే తప్పు చేసినట్లు మాట్లాడితే ఎలా? అని నిలదీశారు. కేసీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తమ జిల్లాను మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పుణ్యమాని వ్యవసాయం సంగతి అటుంచితే.. తాగునీటికీ ఇబ్బందులు తప్పడం లేదన్నారు. జగదీశ్‌రెడ్డికి ముఖం చెల్లకే నేడు సభకు రాలేదన్నారు.

కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలన్నారు. ఆ తర్వాతే నల్గొండ సభకు రావాలని కోమటిరెడ్డి డిమాండ్‌ చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను అలా అనడం సరికాదన్నారు.

సభలో తీర్మానం ప్రవేశపెట్టిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో ఆ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కేసీఆర్ పాలనలో జరిగిన తప్పుడు విధానాలే.. ఇప్పుడు తెలంగాణకు శాపాలయ్యాయని పేర్కొంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని.. రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం కృషి చేస్తామని స్పష్టం చేసింది.

గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జల దోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. ‘‘ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్‌పైకి పోలీసులను పంపింది. రోజుకు 3 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయింది. కేసీఆర్‌ ఓడిపోబోతున్నారనే సాగర్‌పైకి జగన్‌ పోలీసులను పంపినట్లు అనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులకు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదు. రాష్ట్ర ప్రజలకు అపోహలు కలిగేలా కొందరు మాట్లాడుతున్నారు.

బచావత్‌ ట్రైబ్యునల్‌ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదు. రాష్ట్ర నీటి హక్కుల సాధనలో గత సర్కారు విఫలమైంది. బీఆర్ఎస్ పాలకులది అసమర్థతో.. అవగాహనా లోపమో అర్థంకాదు. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు గత ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దిల్లీ వెళ్లి 512:299 టీఎంసీలకు ఒప్పుకొన్నారు. ఆ కేటాయింపును ఏపీ ప్రభుత్వం శాశ్వతం చేస్తోంది. కృష్ణా జలాల్లో 70 శాతం హక్కులు పొందేందుకు తెలంగాణకు అర్హత ఉంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదు.

జగన్‌, కేసీఆర్‌ గంటలతరబడి మాట్లాడుకున్నారు.. కలిసి బిర్యానీలు తిన్నారు. కేసీఆర్‌ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్‌ పొగిడారు. తెలంగాణ జలాలను సైతం ఇస్తున్నారని చెప్పారు. 2020 మే 5న ఏపీ ప్రభుత్వం జీవో నంబర్‌ 203 జారీ చేసింది. రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించాలని నిర్ణయించింది. 797 అడుగుల వద్ద నీటి తరలింపు జీవో ఇచ్చింది’’ అన్నారు. ఈ సందర్భగా కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ ఏపీ శాసనసభలో సీఎం జగన్‌ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను ప్రదర్శించారు.

రాయలసీమ లిఫ్ట్‌ పూర్తయితే రోజుకు 8 టీఎంసీల నీటిని ఏపీ తరలిస్తుంది. ఆ లిఫ్ట్‌ టెండర్లు పూర్తయ్యాకే కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారు. పరోక్షంగా సహకరించారు. కావాలనే ఆయన అపెక్స్‌ కౌన్సిల్ భేటీకి హాజరుకాలేదు. సమావేశానికి వెళ్లి అభ్యంతరం తెలిపితే రాయలసీమ లిఫ్ట్‌ ఆగేది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 2013లోనే ప్రాజెక్టు మొదలైనా.. ఇప్పటికీ పనులు పూర్తిచేయలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. నల్గొండలో నిర్వహించే సభకు వెళ్లేముందు కృష్ణా జలాల అంశంలో తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు భారాస క్షమాపణ కోరాలి’’ అని ఆయన డిమాండ్‌ చేశారు.