Telangana: ఫ్లెక్సీల కోసం పెట్టిన డబ్బు ప్రజల కోసం ఖర్చు పెట్టు కేసిఆర్, ప్రజల వద్ద మొహం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి పారిపోతున్నారని ఎద్దేవా చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

తెలంగాణ సర్కారుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bjp Cheif Bandi Sanjay) మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలే తమకు బాస్‌లు అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ సమాజానికి తమ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పారని పేర్కొన్నారు

BJP-Chief-Bandi-Sanjay (Photo-Video Grab)

Hyd, July 4: తెలంగాణ సర్కారుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bjp Cheif Bandi Sanjay) మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలే తమకు బాస్‌లు అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ సమాజానికి తమ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటన ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు (Begumpet Airport) వద్ద సోమవారం ప్రధాని మోదీకి బండి సంజయ్‌ వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. సీఎం ఎవరు కౌన్ కిస్కా.. కేసీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ముందు తెలంగాణ ప్రజలకు కేసిఆర్ (CM KCR ) సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజల వద్ద మొహం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి పారిపోతున్నారు. మోదీని ఎదుర్కోడానికి ఫ్లెక్సీల కోసం పెట్టిన డబ్బులను ప్రజల కోసం ఖర్చు పెట్టు కేసిఆర్ అని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్‌ రావడం పక్కా, అభివృద్ధి ఎజెండాతో సాగిన ప్రధాని మోదీ ప్రసంగం, తెలంగాణకు ఏం చేశామో చెప్పిన మోదీ, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంటామంటూ హామీ

నిన్నటి ప్రధాని సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నాం. కేసిఆర్ మీద ఉన్న వ్యతిరేకత నిన్నటి విజయ సంకల్ప సభతో మరోసారి బహిర్గతం అయింది. కేసీఆర్ తప్పుడు విధానాల పలితమే నిన్నటి సభ అని తెలిపారు. తెలంగాణ ప్రజలకు మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement