Hyderabad, July 03: తెలంగాణలో (Telangana) డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో మోదీ (Modi)ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీపై ఎన్నో రెట్లు నమ్మకం పెరిగిందన్నారు. ‘‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్.. మంత్రంతో తెలంగాణ అభివృద్ధి చేస్తాం. 8 ఏళ్లుగా దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించాం. దళితులు, ఆదీవాసీల ఆకాంక్షలను బీజేపీ (BJP) నెరవేర్చింది. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెంచాం. కరోనా కష్టకాలంలో ఇక్కడున్న ప్రతి కుటుంబానికి అండగా ఉన్నాం. జీహెచ్‌ఎంసీ(GHMC) ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయి. డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారు. తెలంగాణ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించారు. తెలంగాణ (Telangana) చరిత్ర, సంస్కృతి, శిల్పకళ అందరికీ గర్వకారణం ’’ అని మోదీ అన్నారు.
Telangana | When BJP's double engine govt will be formed in Telangana, development work will be expedited in every city and village of the state: PM Modi at a rally in Hyderabad pic.twitter.com/8HRyyZZd4K
— ANI (@ANI) July 3, 2022
‘‘ఆవిష్కరణల్లో దేశంలోనే తెలంగాణ కేంద్రంగా మారింది. మా పాలనలో గ్రామాల్లోని యువతకు ప్రోత్సాహం ఇస్తున్నాం. తెలంగాణ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. పంటలకు కనీస మద్దతు ధర పెంచాం. రామగుండం ఎరువుల పరిశ్రమను పునరుద్ధరించాం. తెలంగాణలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోంది. భాగ్యనగరంలో అనేక పై వంతెనలు నిర్మించాం. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్‌రోడ్డు(Regeinal Ring road) కూడా నిర్మిస్తున్నాం.మా పాలనలో తెలంగాణలో హైవేలు రెండు రెట్లు పెరిగాయి. తెలంగాణలో మెగా టెక్స్ టైల్ పార్క్ (Mega Textile park)ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చి తీరుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసమే ఇచ్చా’’ అని మోదీ అన్నారు.
సోదర సోదరీమణులకు నమస్కారాలు అంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారభించారు. ‘‘ఎంతోదూరం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు అభినందనలు. తెలంగాణ నేలతల్లికి వందనం సమర్పిస్తున్నా. తెలంగాణ గడ్డకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. తెలంగాణ మొత్తం ఈ మైదానంలో కూర్చున్నట్టు ఉంది. హైదరాబాద్ నగరం అన్ని రంగాల వారికి అండగా నిలుస్తోంది. ప్రాచీన సంస్కృతి, పరాక్రమానికి తెలంగాణ పుణ్యస్థలం. తెలంగాణ పవిత్ర భూమి. దేశ ప్రజలకు యాదాద్రి నరసింహస్వామి, గద్వాల జోగులాంబ, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి’’ అని మోదీ అన్నారు.