BJP-TRS Hoarding War: టీఆర్ఎస్-బీజేపీల మధ్య ముదిరిన ఫ్లెక్సీల వార్, సాలు దొర సెలవు దొర అంటున్నకమల దళం, సాలు మోదీ సంపకు మోదీ అంటున్న కారు దళం

హైదరాబాద్ లో జులై 2 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలు కానున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, దేశం నలుమూలల నుంచి ప్రముఖ బీజేపీ నేతలు హాజరు కానున్నారు

BJP-TRS hoarding war peaks in Hyderabad (Photo-Twitter)

Hyd, June 30: హైదరాబాద్ లో జులై 2 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలు కానున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, దేశం నలుమూలల నుంచి ప్రముఖ బీజేపీ నేతలు హాజరు కానున్నారు. బీజేపీ తెలంగాణ శాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ సర్కారును లక్ష్యంగా చేసుకుని నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు (BJP-TRS Hoarding War) ఏర్పాటు చేసింది.

‘సాలు దొర సెలవు దొర’ అంటూ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన ఫొటోతో క్యాప్షన్ రాసి పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద డిజిటల్ డిస్ ప్లే ఏర్పాటు చేసింది. కల్వకుంట్ల కౌంట్ డౌన్ అంటూ రోజులు, సమయం కూడా చూపిస్తోంది. దీనికితోడు నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే మాదిరి పోస్టర్లతో నింపేసింది. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో అధికారంపై బీజేపీలో (BJP) ఎంతో ధీమా కనిపిస్తోంది.

రైతు బంధుపై ఎలాంటి ఆంక్షలు లేవు, ల‌బ్ధిదారులంద‌రికీ రైతుబంధు జ‌మ చేస్తున్నామ‌ని తెలిపిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, తొలి రోజు రూ.586.65 కోట్లు విడుదల

అటు టీఆర్ఎస్ (TRS) కూడా తగ్గదే లేదన్నట్టు.. ‘సాలు మోదీ సంపకు మోదీ’ పేరుతో పోటీ హోర్డింగ్ లు పెట్టేసింది. పక్కనే మోదీ సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను విమర్శిస్తూ క్యాప్షన్లు రాసింది. ‘రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపినవ్’, 'హటాత్తుగా లాక్ డౌన్ పెట్టి గరీబోళ్లను చంపినవ్’, 'నాలుగు సంవత్సరాల కాంట్రాక్టు ఉద్యోగాలు మాత్రమే అని యువత కడుపు కొట్టినవ్’ అంటూ పలు క్యాప్షన్లు రాసింది. కింది భాగంలో బైబై మోదీ అని రాసి ఉండడం కనిపించింది.

వీటిని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు (BJP-TRS hoarding war peaks in Hyderabad ) చేశారు. వీటిని చూసిన వాహనదారులు సరదాగా నవ్వుకుంటున్నారు. రెండు పార్టీల మధ్య కొంత కాలంగా విమర్శలు తార స్థాయికి చేరడం తెలిసిందే. అటు సోషల్ మీడియాలోనూ ఇరు పార్టీల మధ్య విమర్శలు వేడెక్కాయి. మరోవైపు బీజేపీపై అధికార టీఆర్ఎస్ సర్కారు పరోక్ష చర్యలకు సైతం దిగింది. అనుమతి లేదని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిస్ ప్లే ను జీహెచ్ఎంసీ తొలగించింది. నగరవ్యాప్తంగా బృందాలు తిరుగుతూ అనుమతి లేకుండా పెట్టిన హోర్డింగ్ లు, కటౌట్లకు చలానాలు విధిస్తున్నాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement