CM Revanth Reddy On Ganesh Festival: హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా గణేష్ ఉత్సవాలు, గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్, సెప్టెంబర్ 19న మిలాద్-ఉన్-నబీ వేడుకలు...సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ
గణేష్ ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రివ్యూ నిర్వహించిన రేవంత్..పలు కీలక సూచనలు చేశారు. అనుమతులు తీసుకున్న మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని, అధికారులు, నిర్వాహకులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణలో సుప్రీం కోర్టు నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
Hyd, Aug 30: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. గణేష్ ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రివ్యూ నిర్వహించిన రేవంత్..పలు కీలక సూచనలు చేశారు. అనుమతులు తీసుకున్న మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని, అధికారులు, నిర్వాహకులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణలో సుప్రీం కోర్టు నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
హైదరాబాద్ నగరం తొలి నుంచి మత సామరస్యానికి, ప్రశాంతతకు పేరు పొందిందని, ఆ ఇమేజ్‌ను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాల నిర్వహణ ఉండాలన్నారు.ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు, అధికారులు అందరూ కలిసి ముందుకు సాగాలని సూచించారు.ఇక ఈ సందర్భంగా మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనలను సెప్టెంబరు 19 వ తేదీన నిర్వహించుకునేందుకు మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు.
మిలాద్-ఉన్-నబీ ఏర్పాట్లపై ముస్లిం మత పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం రేవంత్. సెప్టెంబరు 7 నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు, 17న నిమజ్జనం ఉన్న నేపథ్యంలో మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 16 న మిలాద్-ఉన్-నబీ వేడుకలను వాయిదా వేసుకోవాలని కోరారు సీఎం రేవంత్. దీంతో ప్రదర్శనలను వాయిదా వేసుకోవడానికి ఈ సందర్భంగా మిలాద్ కమిటీ అంగీకరించింది
మండపాల ఏర్పాటు, తొమ్మిది రోజుల ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనానికి సంబంధించి మండప నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనో అనుమతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాగే మాట్లాడుతారా ? రేవంత్ రెడ్డిపై మండిపడిన సుప్రీంకోర్టు
Here's Tweet:
ప్రభుత్వం తరఫున పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖతో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులు సైతం మండప నిర్వాహకులతో సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. నిమజ్జన మహోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎటువంటి లోటుపాట్లకు తావు ఇవ్వొద్దని సీఎం హెచ్చరించారు.
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ముందుగా మండప నిర్వాహకులు ఉచిత విద్యుత్ సరఫరాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.