Telangana: బీఆర్ఎస్ గూటికి మరో నలుగురు ఎమ్మెల్యేలు?, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటేనా?,కాంగ్రెస్ నెక్ట్స్ స్టెప్ ఏంటీ?

ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం ఉంటుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తమ మనసు మార్చుకుంటున్నారు.

Telangana: Congress joined MLAs returns to BRS! good move for KTR!

Hyd, July 31: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం ఉంటుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తమ మనసు మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా తొలుత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్‌ గూటికి చేరారు. ఇది గులాబీ శ్రేణుల్లో కొండంత ధైర్యాన్ని నింపింది.

ఇక ఇదే బాటలో కాంగ్రెస్ నుండి చేరిన 9 మంది ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యులు గులాబీ గూటికి వచ్చేందుకు రెడీగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గద్వాల ఎమ్మెల్యే రాకను స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. గాంధీ భవన్‌ వేదికగా ఆందోళన సైతం చేపట్టారు. అయితే ఇవేమి పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరడం వరకు బాగానే ఉన్న స్థానిక నేతలు మాత్రం ఆయన్ని కలిసేందుకు కూడా సుముఖత చూపలేదు. దీంతో గత్యంతరం లేక కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి బీఆర్ఎస్‌లోనే ఉంటామని ప్రకటించి కేటీఆర్‌ని కలిశారు.

కాంగ్రెస్‌లో చేరినా మిగితా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇలాగే ఉంది. దీంతో గద్వాల ఎమ్మెల్యే బాటలోనే మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ కూడా తిరిగి సొంతగూటికి చేరుతారనే టాక్ నడుస్తోంది. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్‌కు బూస్ట్ ఇస్తుందనే చెప్పాలి. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తున్న నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు వెనక్కి వచ్చినా అది ఖచ్చితంగా గులాబీ పార్టీకి అనుకూలంగా మారుతుండటంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌కు మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉండగా 10 మంది కాంగ్రెస్‌లో చేరారు. ఎలాగైనా బీఆర్ఎస్ నుండి 26 మందిని లాగేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్. కానీ ఇప్పుడు ఆపరేషన్ వికర్ష్‌తో కాంగ్రెస్ నేతలు డిఫెన్స్‌లో పడ్డారు.  మళ్ళీ సొంత గూటికి గ‌ద్వాల ఎమ్మెల్యే, గులాబీ పార్టీలో కొనసాగుతాన‌ని స్పష్టం చేసిన బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి