Telangana DGP: ఈ ఏడాది 2945 రేప్ కేసులు..సైబర్ క్రైమ్ పెరిగిందన్న డీజీపీ జితేందర్, వ్యక్తిగత కారణాలతోనే పోలీసుల ఆత్మహత్య అని వెల్లడి
మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలిస్ శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవు అన్నారు
Hyd, December 29: వ్యక్తిగతంగా లేదా కుటుంబ సమస్యలతో పోలిసులు ఆత్యహత్యలు జరుగుతున్నాయి అన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్. మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలిస్ శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవు అన్నారు. చాలా చోట్ల వ్యక్తి గత కారణలతోనే ఆత్మహత్య జరుగుతున్నాయి.. సంధ్య థియేటర్ ఘటన కేసులో దర్యాప్తు సాగుతోందన్నారు.
ఈ ఏడాది 2945 రేప్ కేసులు నమోదు, తెలియని వారు రేప్ చేసినట్లు గుర్తించింది 23 కేసులు అన్నారు. మిగిలిన 2922 కేసులు తెలిసిన వారే అత్యాచారం కి పాల్పడినట్లు గుర్తించామన్నారు. 428 కేసుల్లో 5.42 కోట్లు రేప్ , ఫోక్సో కేసుల్లో నష్ట పరిహారం వచ్చిందన్నారు. SC , ST కేసులు 2257 కేసులు నమోదు కాగా మహిళలపై దాడులు, వేధింపులు, హత్యలు కలిపి 19922 కేసులు ఉన్నాయన్నారు.
డౌరీ మర్డర్ 22, వరకట్న వేధింపు మృతి 126 , మహిళల హత్యలు241, కిడ్నాప్ లు1122, కేసులు నమోదు అయ్యాయని చెప్పారు.
ఫోన్ టైపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని... ఈ కేసులో సిబిఐకి లేఖ రాశాము అన్నారు. అమెరికా నుండి ఇండియాకు రప్పించాలంటే ఇంటర్నేషనల్ ప్రాసెస్ జరుగుతుందని... ఇప్పటికే ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటున్నాం అన్నారు.ప్రభాకర్ రావు ను హైదరాబాద్ కి తీసుకురావడానికి సమయం పడుతుందన్నారు.
మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము అని..రాష్ట్రంలో మతపరమైన కమ్యునల్ సమస్యలు లేవు అన్నారు. పారదర్శకంగా శాంతి భద్రతలు కాపాడమని...అమాయక ప్రజలను నక్సల్స్ హతమార్చారు అన్నారు. పోలీస్ కూంబింగ్ చేయాల్సి వచ్చింది...0%శాతం డ్రగ్స్ నిర్మూలన దిశగా పోలీస్ తగిన చర్యలు తీసుకుందన్నారు. ఈ ఏడాది గంజాయి 1950 కేసులు నమోదు అయ్యాయి. కేసులు పెరిగాయి అన్నారు. 20టన్స్ గాంజాయి సీజ్ చేసాము...స్పెషల్ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ నిర్మూలన కృషి చేస్తుందన్నారు.
48 డ్రగ్ కేసుల్లో నిందితులకు శిక్ష పడింది..ఇతర స్టేట్ నుండి గంజాయి రవాణా కట్టడి చేశామన్నారు. 142 కోట్ల విలువ చేసే గంజాయి సీజ్ చేశామని... సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. దేశంలో మొదటి సారి 2.42 కోట్ల నగదు సైబర్ నేరగాళ్ల నుండి కాపాడమని...180 కోట్ల నగదు బాధితులకు అందజేశామన్నారు. 10 వేల ఐ ఎం ఈ ఏ నెంబర్లు బ్లాక్ చేశామని...ఈ ఏడాది డయాళ్ 100 కాల్స్ ..16,92 వేల కాల్స్ రిసివ్ చేశామన్నారు. 7నిమిషాల వ్యవధిలో ఘటన స్థలానికి చేరుకోగలిగము...1000 పెట్రోల్ కార్స్ ఉన్నాయి అన్నారు. సాగు చేసే వారికే రైతు భరోసా...స్పష్టం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సర్వే నెంబర్ల వారిగా సాగు వివరాలు సేకరిస్తున్నామని వెల్లడి
2,100 బ్లు కొల్ట్స్ పోలీస్ కానిస్టేబుల్ అఫీసర్స్ విధులు నిర్వహిస్తున్నారు...ఈ ఏడాది బాధితులు పోగొట్టుకున్న 75 వేల ఫోన్స్ ట్రేస్ చేశాం...రికార్డు స్థాయిలో నవంబర్ మాసంలో 38వేల ఫోన్స్ బాధితులకు సైతం అందజేశామన్నారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు ట్రాన్స్ జెండర్ లను విధుల్లోకి తీసుకున్నాం అని...మహిళలు చిన్నారుల రక్షణ పోలీస్ బాధ్యత పోలీస్ హెల్ప్ లైన్ లో భాగంగా 29,600 ట్రాక్ చేశామన్నారు. రౌడీ షీటర్ లపై కఠిన చర్యలు తీసుకున్నాం అన్నారు.
18 కేసులు నమోదు చేశామని...ఇందులో 35 మంది రౌడి షీటర్ లకు కన్విక్షన్ వచ్చిందన్నారు. 77 పోక్సో కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 82 కేసులో నిందితులకు శిక్ష పడిందన్నారు.