TS Govt Increased Aasara Pension: ఆసరా పింఛన్ పెంచుతూ తెలంగాణ సర్కారు నిర్ణయం, వచ్చే నెల నుంచి దివ్యాంగులకు రూ. 4016 పెన్షన్
ఆసరా పెన్షన్లను (Asara pension) రూ.4016 పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన పెన్షన్ జులై నెల నుంచి అమలులోకి రానుందని ప్రభుత్వం తెలిపింది.
Hyderabad, July 22: తెలంగాణలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) శుభవార్త చెప్పారు. ఆసరా పెన్షన్లను (Asara pension) రూ.4016 పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన పెన్షన్ జులై నెల నుంచి అమలులోకి రానుందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి కలుగనున్నది. పెన్షన్ల పెంపుపై మంత్రులు హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. పెన్షన్ల పెంపుపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) హర్షం వ్యక్తం చేశారు.
దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా దివ్యాంగులకు రూ.4016కు పెన్షన్ పెంచినట్లు తెలిపారు. చారిత్రాత్మక నిర్ణయంతో 5లక్షల మందికిపైగా దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ల పెంపు బీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమంటూ ట్వీట్ చేశారు.