Dalit Bandhu Scheme: దళిత బంధు కింద హుజురాబాద్‌కు మరో రూ.500 కోట్ల నిధులు, ఈ వారంలో మరో రూ.వెయ్యి కోట్లు విడుదల, ఈ పథకం కోసం పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రూ.2వేల కోట్లు విడుదల చేయాలని గతంలో కేసీఆర్ ఆదేశాలు

తెలంగాణలో దళిత కుటుంబాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని (Dalit Bandhu Scheme) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని హుజురాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా హుజురాబాద్‌లో దళితబంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది.

Telangana CM KCR | File Photo

Huzurabad, August 23: తెలంగాణలో దళిత కుటుంబాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని (Dalit Bandhu Scheme) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని హుజురాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా హుజురాబాద్‌లో దళితబంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే తొలి విడతలో రూ.500 కోట్లు విడుదల చేయగా, తాజాగా రెండో విడతలో రూ.500 కోట్లను (Telangana govt releases Rs 500 crore) ప్రభుత్వం విడుదల చేసింది.

హుజూరాబాద్ సభ అనంతరం ఈ పథకం కోసం పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రూ.2వేల కోట్ల విడుదల చేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో మరో రూ.వెయ్యి కోట్లు విడుదల కానుంది. కాగా.. వారం రోజుల్లోపు మరో రూ.వెయ్యి కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నది. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.2 వేల కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి. ఈనెల 16న సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు దళితబంధు చెక్కులను అందజేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement