Telangana Record IT Exports: ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రికార్డు.. 2.41 లక్షల కోట్లకు.. జాతీయ సగటు కంటే మూడున్నర రెట్లు ఎక్కువ వృద్ధి

ఐటీ రంగంలో దేశంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ దూసుకుపోతున్నది. తొమ్మిదేండ్లలోనే తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో రికార్డుస్థాయిలో 31.44% వృద్ధిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అదే సమయంలో భారత్‌ వృద్ధి కేవలం 9.36% మాత్రమేనని వెల్లడించారు.

Telangana IT Minister KTR (PIC @ FB)

Hyderabad, June 6: ఐటీ రంగంలో (IT Sector) దేశంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ (Telangana)  దూసుకుపోతున్నది. తొమ్మిదేండ్లలోనే తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో (IT Exports) రికార్డుస్థాయిలో 31.44% వృద్ధిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ (KTR) తెలిపారు. అదే సమయంలో భారత్‌ వృద్ధి కేవలం 9.36% మాత్రమేనని వెల్లడించారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ జాతీయ సగటు కంటే మూడున్నర రెట్లు ఎక్కువ వృద్ధి సాధించిందని తెలిపారు. 2013-14లో హైదరాబాద్‌లో ఐటీ ఉత్పత్తులు రూ.56 వేల కోట్లు ఉంటే.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ 2.41 లక్షల కోట్లకు చేరుకొన్నామని వివరించారు. 2022-23లో ఐటీ ఉద్యోగాల్లో 16.29 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు.

Heart Attacks On Mondays: తీవ్రమైన గుండెపోట్లు సోమవారం రోజునే ఎక్కువ.. ఆదివారం రోజు స్టెమీ మరణాలు అధికం.. గుండెపోట్లపై ఐర్లాండ్ పరిశోధన సంస్థ అధ్యయనం

ఏడాదిలోనే లక్షా 27 వేల 594 కొత్త ఉద్యోగాలు

2021-22లో ఐటీ రంగంలో 7 లక్షల 78 వేల 121 ఉద్యోగాలుంటే 2022-23 వరకు 9 లక్షల 5 వేల 715కు పెరిగాయని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే లక్షా 27 వేల 594 కొత్త ఉద్యోగాలు వచ్చినట్టు చెప్పారు. సోమవారం టీ హబ్‌ వేదికగా 2022-23 ఐటీ శాఖ వార్షిక నివేదికను ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ, ఐటీ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతున్నదని, ఈ రంగంలో తొమ్మిదేండ్లలోనే ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్‌ను నిలబెట్టామని చెప్పారు.

AP CM YS Jagan Mohan Reddy Polavaram Visit: పోలవరం పర్యటనకు బయల్దేరిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అధికారులకు కీలక సూచనలు చేసే అవకాశం

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now