Covid cases in Telangana: తెలంగాణలో తగ్గని కరోనా తీవ్రత, ఒక్కరోజే 2,398 పాజటివ్ కేసులు నమోదు, హైదరాబాద్‌ పరిధిలోనే అత్యధికంగా కరోనా కేసులు

రోజురోజుకు పాజిటివ్ కేసులు (positive cases) పెరిగిపోతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,398 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. మ‌రో 1,81 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. రిక‌వ‌రీ రేటు (recovery rate) 96.35 శాతంగా ఉంది.

coronavirus in idnia (Photo-PTI)

Hyderabad January 14: తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి (Corona cases) విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు (positive cases) పెరిగిపోతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,398 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. మ‌రో 1,81 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. రిక‌వ‌రీ రేటు (recovery rate) 96.35 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 21,676 కేసులు యాక్టివ్‌గా(active cases) ఉన్నాయి. రాష్ట్రంలో ఇవాళ 68,525 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

జీహెచ్ఎంసీ(GHMC) ప‌రిధిలో కొత్త‌గా 1,233 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 192, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరిలో 191, సంగారెడ్డిలో 75, హ‌నుమ‌కొండ‌లో 60, నిజామాబాద్‌లో 50, పెద్ద‌ప‌ల్లిలో 43, భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో 38, క‌రీంన‌గ‌ర్‌లో 33, ఖ‌మ్మంలో 41, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 44, మంచిర్యాలలో 49, మ‌హ‌బూబాబాద్‌లో 32, సిద్దిపేట‌లో 33, సూర్యాపేట‌లో 31, న‌ల్ల‌గొండ‌లో 28, మెద‌క్‌, జ‌గిత్యాల‌లో 20 పాజిటివ్ కేసుల చొప్పున న‌మోదు అయ్యాయి.