COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 1430 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 47 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 429కి పెరిగిన కరోనా మరణాలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనావైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈరోజు నిజామాబాద్ నుంచి 48 కేసులు బయటపడగా, కామారెడ్డి నుంచి 43 కేసులు నిర్ధారణ అయ్యాయి. అటు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ మరియు నల్లగొండ జిల్లాల్లో కూడా కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతోంది....

COVID in india | (Photo-PTI)

Hyderabad, July 21: తెలంగాణలో ఇటీవల కాలంగా కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తుంది.  గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 1430 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 47,705 కి చేరుకుంది.

కేసుల సంఖ్య గతంలో కంటే తక్కువగా వస్తున్నప్పటికీ అప్రమత్తంగానే ఉండాలి.  జీహెచ్ఎంసీ పరిధి వెలుపల రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. మంగళవారం  నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 703 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, నగరానికి సమీపంలో ఉండే రంగారెడ్డి జిల్లా నుంచి 117 కేసులు, మేడ్చల్ నుంచి 105 , సంగారెడ్డి నుంచి 50 పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనావైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈరోజు నిజామాబాద్ నుంచి 48 కేసులు బయటపడగా, కామారెడ్డి నుంచి 43 కేసులు నిర్ధారణ అయ్యాయి. అటు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ మరియు నల్లగొండ జిల్లాల్లో కూడా కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతోంది. తెలంగాణలో కొవిడ్19 పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష, హైకోర్ట్ వ్యాఖ్యలను సీఎం దృష్టికి తెచ్చిన అధికారులు

TS's COVID Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

మంగళవారం  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 7 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 429 కు పెరిగింది.

అలాగే, మంగళవారం  సాయంత్రం వరకు మరో  2062 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 36,385 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు, రాష్ట్రంలో రికవరీ రేటు 76 శాతంగా ఉంది.  ప్రస్తుతం తెలంగాణలో 10,891 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో  16,855 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,93,077 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement