Secunderabad Railway Station: గాలి నుంచి మంచి నీరు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కియోస్క్, ఈ నీటికి జలవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం, కేవలం రూ.5కే లీటర్ బాటిల్ నీరు

గాలి నుండి నీటి తీయటం సాధ్యమయ్యే పనేనా అని చాలామంది అనుకోవచ్చు. అయితే అది సాధ్యమేనని సికింద్రాబాద్ రైల్వే అధికారులు చేసి చూపించారు. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ‘అట్మాస్పియరిక్ వాటర్ జనరేటర్ ’కియోస్క్ ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Telangana secunderabad-station-offers-drinking-water-made-from-air-at-rs-5 (Photo-SCR)

Hyderabad,December 14: ఇండియాలోనే తొలిసారిగా గాలి నుంచి నీటిని తీసే పద్ధతిని ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. గాలి నుండి నీటి తీయటం సాధ్యమయ్యే పనేనా అని చాలామంది అనుకోవచ్చు. అయితే అది సాధ్యమేనని సికింద్రాబాద్ రైల్వే అధికారులు చేసి చూపించారు. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ‘అట్మాస్పియరిక్ వాటర్ జనరేటర్ ’కియోస్క్ ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ప్రక్రియలో వడపోత వ్యవస్థ ద్వారా గాలిని యంత్రంలోకి పంపిస్తారు. అది తేమతో నిండి ఉన్న కలుషితాలను ఫిల్టర్ చేస్తుంది. తర్వాత శుభ్రపరిచిన గాలిని ఒక గదిలోకి పంపబడుతుంది. అక్కడ గాలి ఘనీకృత రూపంలో ఉంటుంది. అలా ఉన్న గాలి నీటిగా మార్చబడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా గాలి నుంచి నీటి తయారు చేస్తారు. ఈ పద్ధతి ద్వారా తయారైన నీరు సురక్షితమైనది అని జలవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదించింది.

Here's Tweet

ఈ పద్ధతి ద్వారా రోజుకు 1000 లీటర్ల నీరు ఉత్పత్తి జరుగుతుంది. ప్రయాణికులు తమ సొంత బాటిల్ తీసుకువస్తే లీటరకు రూ.5, లేకుంటే లీటరకు రూ.8 వసూలు చేయాలని ప్రతిపాదించారు. కియోస్క్ ఏర్పాటుకు కృషి చేసిన జోన్ అధికారులను, సిబ్బందిని ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ గజనన్ మాల్యా ప్రశంసించారు. త్వరలో ఇతర రైల్వే స్టేషన్ ల్లలో కూడా అందుబాటులోకి తీసుకురావటానికి ఏర్పాటు చేస్తామని తెలిపారు.