Telangana Shocker: బంజారాహిల్స్‌లో దారుణం, ఇంట్లోకి దూరి యువతిని రేప్ చేసిన కామాంధుడు, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులు

హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. బంజారా హిల్స్ లో (Banjara Hills) తన పక్కింట్లో నివాసం ఉంటున్న ఓ యువతిపై కన్నేసిన కామాంధుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Representational image (Photo Credit: File Photo)

Hyd, August 8: హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. బంజారా హిల్స్ లో (Banjara Hills) తన పక్కింట్లో నివాసం ఉంటున్న ఓ యువతిపై కన్నేసిన కామాంధుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సామ్‌ రాష్ట్రానికి చెందిన యువతి(22) బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 5లోని దేవరకొండ బస్తీలో అక్కాబావల వద్ద ఉంటూ ఓ మల్టిఫ్లెక్స్‌లో టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో పనిచేస్తోంది.

అదే రాష్ట్రానికి చెందిన చిన్మయ్‌ సైకియా(24) అనే యువకుడు కూడా అదే ప్రాంతంతో నివాసం ఉంటూ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని ఓ షాపింగ్‌ మాల్‌లో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4న యువతి తన గదిలో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన చిన్మయ్‌ సైకియా లోనికి ప్రవేశించాడు. ఆమెపై లైంగికదాడికి (Watchman rapes woman) పాల్పడడంతో పాటు ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు.

యూపీలో దారుణం, ప్రియుడిని చంపేసి మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కిన మహిళ, నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు

అప్పటి నుంచి తీవ్రంగా ఏడుస్తూ ఇంట్లోనే ఉంటోంది. శనివారం రాత్రి బాధితురాలి సోదరి ఏంజరిగిందని ఆరా తీయగా విషయం బయటపడింది. దీంతో బాధితురాలితో కలిసి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement