IND Vs AUS Tickets Stampede:హైదరాబాద్ బ్రాండ్‌ను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదు, 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి, జింఖానా తొక్కిసలాట ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్

జింఖానా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.టికెట్ల విక్రయంలో హెచ్‌సీఏ (HCA) పూర్తిగా విఫలమైందని క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (minister srinivas goud) మండిపడ్డారు.హైదరాబాద్ బ్రాండ్‌ను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Telangana Minister Srinivas Goud (Photo-Twitter)

Hyd, Sep 22: జింఖానా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.టికెట్ల విక్రయంలో హెచ్‌సీఏ (HCA) పూర్తిగా విఫలమైందని క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (minister srinivas goud) మండిపడ్డారు.హైదరాబాద్ బ్రాండ్‌ను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టికెట్ల అమ్మకం బాధ్యత హెచ్‌సీఏదేనని స్పష్టం చేశారు. HCA ప్రైవేట్ సంస్థ.. లా అండ్ ఆర్డర్‌కు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. కరోనా తర్వాత జరుగుతున్న మ్యాచ్ కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగితే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులతో సమావేశమయ్యారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌, రాచకొండ సీపీ మహేష్ భగవత్ హాజరయ్యారు.సమావేశానికి ముందు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ, టికెట్ల అమ్మకాలు పారదర్శకంగా జరగలేదన్నారు. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠినచర్యలు తప్పవన్నారు. తెలంగాణ ప్రతిష్టను దిగజారిస్తే ఊరుకునేదిలేదన్నారు.హెచ్‌సీఐ పూర్తిగా వైఫల్యం చెందిందని మంత్రి అన్నారు.

జింఖానా ఘటనలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ వైఫల్యంపై పోలీసులు సీరియస్, హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసే అవకాశం

కాగా, ఆసీస్‌-భారత్‌ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్‌ కోసం సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట ( IND Vs AUS Tickets Stampede) జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్‌సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్‌ మాజీ కార్యదర్శి శేష్‌ నారాయణ్‌ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.

కాగా భారత్‌ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల కోసంఈరోజు తెల్లవారుజాము నుంచే అభిమానులు టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద క్యూ కట్టారు. టికెట్ల కోసం పెద్దఎత్తున క్రికెట్‌ అభిమానులు అక్కడికి తరలివచ్చారు. దీంతో అభిమానులను పోలీసులు నియంత్రించలేపోయారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో పలువురు అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. అలాగే పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జింఖానా గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో హెచ్‌సీఏ టికెట్ కౌంటర్లను మూసివేసింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Champions Trophy 2025, AUS Vs ENG: ఛేజింగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా, 351 టార్గెట్‌ను మరో 15 బాల్స్‌ మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో చేధించిన కంగారులు

SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు, కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్మికుల వివరాలివే

KTR Slams Congress: ఇది కాలం తెచ్చిన కరువు కాదు...కాంగ్రెస్ తెచ్చిన కరువు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

Hindi Row: బలవంతంగా హిందీ భాషను ఎవరిపైనా రుద్దే ప్రసక్తే లేదు, సీఎం స్టాలిన్ లేఖకు స్పందించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

Share Now