IPL Auction 2025 Live

Stray Dogs Attack: వీధి కుక్కలు స్వైర విహారం, జనగాం జిల్లాలో 21 మందిపై దాడి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఇంజక్షన్‌ తీసుకుని చికిత్స తీసుకున్న బాధితులు

దొరికన వారిని దొరికినట్లు కరుచుకుంటూ వెళ్లాయి. వీధి కుక్కల స్వైరవిహారంతో పలు ప్రాంతాల్లో 23మంది తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలోనే ఏకంగా 21 మంది వీధి కుక్కల బారిన పడి గాయాలపాలయ్యారు

(Photo Credits: Dog Lovers Foundation/Facebook)

jangaon, Mar 20: జనగామ జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. దొరికన వారిని దొరికినట్లు కరుచుకుంటూ వెళ్లాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 23మంది తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలోనే ఏకంగా 21 మంది వీధి కుక్కల బారిన పడి గాయాలపాలయ్యారు. కుర్మవాడ, హనుమాన్‌ స్ట్రీట్‌ తదితర ప్రాంతాలకు చెందిన స్థానికులు రోడ్డుపై వెళ్తుండగా కుక్కలు దాడి చేశాయి.

చైల్డ్ పోర్నోగ్రఫీపై హైదరాబాద్ పోలీసులు కొరడా, 44 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు, చూసినా, ప్రమోట్ చేసినా 5 ఏళ్లు జైలు శిక్ష

సమీప వాసులు కర్రలు, రాళ్లతో తరిమికొట్టడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వెంటనే బాధితులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కుక్క కాటుకు సంబంధించిన ఇంజక్షన్‌ తీసుకుని చికిత్స పొందారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట పద్మానగర్‌కు చెందిన పదేళ్ల బాలుడు మహ్మద్‌ అర్స్‌లాన్‌ రోడ్డుపై ఆడుకుంటుండగా కుక్క కరవడంతో చేతికి గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు.