TSRTC: చిల్లర సమస్యకు చెక్, తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో రౌండప్ చార్జీలను ఖరారు చేసన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
బస్సుల్లో చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (V.C Sajjanar) దీన్ని పరిష్కరించేందుకు రౌండప్ చార్జీలను (TSRTC Bus Fares 2022) ఖరారు చేశారు.
Hyd, Mar 17: తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు ఇకపై చెక్ పడింది. బస్సుల్లో చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (V.C Sajjanar) దీన్ని పరిష్కరించేందుకు రౌండప్ చార్జీలను (TSRTC Bus Fares 2022) ఖరారు చేశారు. గురువారం నుంచి ఈ కొత్త (రౌండప్) చార్జీలను (New Bus Charges in Telangana)) అమలు చేయాలని ఆదేశించారు. రెండు రోజులు బయటకెళ్తే మాడిపోతారు, తెలంగాణలో వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరిక, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
రూ.12చార్జీ ఉన్న చోట టికెట్‌ను రూ. 10 రౌండప్ చేసి ప్రయాణికుల వద్ద వసూలు చేయనున్నారు. రూ.13, రూ.14 ఉన్న చోట.. ఆ టికెట్లను రూ. 15గా రౌండప్ చేయనున్నారు. అలాగే.. 80 కీలోమీటర్ల దూరానికి ఇప్పటి వరకు రూ.67 వసూలు చేస్తుండగా రౌండప్ ఖరారుతో చార్జీలు రూ.65 మాత్రమే వసూలు చేయనున్నారు.