Telangana Weather Update: తెలంగాణ వాసులకు చల్లటి కబురు, వచ్చే 10 రోజుల పాటు ఎండలు తగ్గి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ

వచ్చే పది రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గి.. పలు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం కాస్త చల్లబడింది.

rains

Hyd, April 15: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. వచ్చే పది రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గి.. పలు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం కాస్త చల్లబడింది. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త పడిపోయాయి.ఈ నేపథ్యంలో వచ్చే పది రోజులపాటు అంటే.. ఈ నెల 25 వరకు రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు ఉండవని, సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 25 వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అంచనా వేసింది. పెట్రోల్ బంక్‌లో మోసం ఎలా చేస్తున్నారో వీడియో ఇదిగో, కొంచెం తల పక్కకు తిప్పారో మీ జేబులు గుల్లే..

రాజస్థాన్‌ మీదుగా నైరుతి రుతుపవనాలు తుఫానుగా మారి కోస్తా కర్ణాటక వరకు వ్యాపించాయని తెలిపింది. మరో ఐదురోజులపాటు హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నది. మరోవైపు గురు, శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.