Warangal Shocker: వరంగల్ జిల్లాలో దారుణం, చున్నీతో యువతి చేతులు కట్టేసి గొంతు కోసి పరారైన యువకుడు, ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణమని అనుమానిస్తున్న పోలీసులు

తెలంగాణలో వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని హనుమకొండ గాంధీనగర్‌లో ప్రేమోన్మాది.. ప్రియురాలు గొంతుకోసి పారిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలం లక్నేపల్లికి కి అనూష కేయులో ఎంసిఏ ఫైనలియర్ చదువుతూ, హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

Hyd, April22: తెలంగాణలో వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని హనుమకొండ గాంధీనగర్‌లో ప్రేమోన్మాది.. ప్రియురాలు గొంతుకోసి పారిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలం లక్నేపల్లికి కి అనూష కేయులో ఎంసిఏ ఫైనలియర్ చదువుతూ, హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈరోజు ఎంసిఏ ఎగ్జామ్ ఉండడంతో గాంధీనగర్‌లో కుంటుంబ సభ్యుల వద్దకు వచ్చింది. అనూష వచ్చిన విషయం తెలుసుకున్న అజార్‌ ఆమెను వెంబడించి చున్నీతో చేతులు కట్టేసి గొంతుకోసి (young man attacked a student with a knife) పరార్ అయినట్టు స్థానికులు చెప్తున్నారు.

తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గొంతు వద్ద ఇంచు వరకు తెగడంతో అనూష మాట్లాడలేకపోతోందని అన్నారు. ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణంగా (refusing to love in Warangal) పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ప్రేమోన్మాది గురించి ఆరా తీస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై గ్యాంగ్ రేప్, కేసులో అలసత్వం వహించిన ఇద్దరు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు, పోలీసుల అదుపులో నిందితులు

గొంతు కోసిన ప్రేమోన్మాది అజార్‌ది సంగెం మండలం ముడ్రాయి గ్రామమని తెలుస్తోంది. ప్రేమను నిరాకరించడంతోనే కత్తితో గొంతు కోసి పారిపోయినట్లు అనూష కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement