IPL Auction 2025 Live

Hyderabad: ఎండల దెబ్బకు హైదరాబాద్‌లో పొంగుతున్న బీర్లు, గత 10 రోజుల్లో రికార్డు స్థాయి అమ్మకాలు, వచ్చే నెలలో గత రికార్డులు బద్దలవుతాయని చెబుతున్న అధికారులు

నిరు‌టితో పోలిస్తే ఏప్రిల్‌ ఒకటి నుంచి పది వరకు బీర్ల అమ్మ‌కాలు 20% పెరి‌గాయి. కేవలం పది రోజు‌ల్లోనే పది లక్షల కేసుల బీర్లు అమ్ము‌డ‌య్యాయి. నిరుడు ఇదే సమ‌యంలో ఈ లెక్క 8.3 లక్షల కేసుల బీర్లుగా ఉన్నది. ఇతర రకాల మద్యం అమ్మ‌కాల్లో స్వల్పంగా తగ్గు‌దల నమో‌దైంది.

Image used for representational purpose only. | (Photo-GETTY)

తెలంగాణ రాష్ట్రంలో మామూలుగానే మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఎండాకాలం (Temperature Soars) వచ్చిందంటే ఇక బీర్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ ఏడాది కూడా అలాగే ఉంది. గతంలో కంటే ఈసారి ఏప్రిల్ నెలలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో మద్యం ప్రియులు ఎండ తీవ్రతను తట్టుకునేందుకు బీరు ను తాగేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. రాష్ట్ర‌వ్యా‌ప్తంగా గత పది‌రో‌జుల్లో బీర్ల అమ్మ‌కాలు పెర‌గ‌డమే (Beer sales skyrocket) ఇందుకు నిద‌ర్శనం.

ప్రస్తుతం అందుతున్న అధి‌కా‌రిక సమా‌చారం ప్రకారం ఏప్రిల్‌ 1 నుంచి 10 వరకు బీర్ల అమ్మ‌కాల్లో పెరు‌గు‌దల నమో‌ద‌వు‌తు‌న్నది. నిరు‌టితో పోలిస్తే ఏప్రిల్‌ ఒకటి నుంచి పది వరకు బీర్ల అమ్మ‌కాలు 20% పెరి‌గాయి. కేవలం పది రోజు‌ల్లోనే పది లక్షల కేసుల బీర్లు అమ్ము‌డ‌య్యాయి. నిరుడు ఇదే సమ‌యంలో ఈ లెక్క 8.3 లక్షల కేసుల బీర్లుగా ఉన్నది. ఇతర రకాల మద్యం అమ్మ‌కాల్లో స్వల్పంగా తగ్గు‌దల నమో‌దైంది. 2021 ఏప్రిల్‌ మొదటి పది‌రో‌జుల్లో 6 లక్షల కేసులుగా ఉన్న మద్యం అమ్మ‌కాలు ఈ ఏడాది 13% తగ్గి 5.14 లక్షల కేసు‌లుగా నమో‌దై‌నట్టు అధి‌కా‌రులు తెలి‌పారు.

నన్ను జైలుకు పంపే దమ్మున్న మగాడెవడో రండి, ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించిన సీఎం కేసీఆర్, రేపు మ‌ధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ

2021 ఏప్రిల్‌ మొదటి పది‌రో‌జుల్లో 6 లక్షల కేసులుగా ఉన్న మద్యం అమ్మ‌కాలు ఈ ఏడాది 13% తగ్గి 5.14 లక్షల కేసు‌లుగా నమో‌దై‌నట్టు అధి‌కా‌రులు తెలి‌పారు. ఇక ఇప్పుడే ఈ రేంజ్ లో డిమాండ్ ఉంటె వచ్చే నెలలో బీర్ల డిమాండ్ మరింత అధికం కావడం ఖాయం అంటున్నారు అధికారులు.