![](https://test1.latestly.com/wp-content/uploads/2024/03/1-934278346.jpg?width=380&height=214)
Hyderabad, JAN 11: తెలంగాణలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక విషయంలో పారదర్శక విధానం పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఆయన ఎక్సైజ్‌శాఖ (CM Revanth reddy Review) అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీజీబీసీఎల్‌కు (TGBCL) ఇప్పటికే మద్యం సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానాన్ని అనుసరించాలని చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టంగా ఉండాలన్నారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లకు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, కనీసం నెల రోజులు నిర్ణీత గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో (New Brands) దరఖాస్తు చేసుకోవాలని, ఆ కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పారు
ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని, పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరల ను పరిశీలించాలని సూచించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ (ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ) నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
గత ఏడాదిగా ఎక్సైజ్ శాఖ కు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ పాల్గొన్నారు.