
Newdelhi, Feb 15: జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) అంటే ఒక్క భారత్ మాత్రమే కాదు యావత్తు ప్రపంచ దేశాలూ ఎంతో గౌరవిస్తాయి. అయితే, బాపూజీ చిత్రాలు ముద్రించిన బీరు క్యాన్లను (Russian Beer Can Features Mahatma Gandhi’s Image) ‘మహాత్మా జి’ బ్రాండ్ పేరిట రష్యన్ కంపెనీ రివోల్ట్ బీర్ల విక్రయాలను చేపట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఒడిశా సామాజిక-రాజకీయ నాయకుడు సుపర్నో సత్పతి ఈ బీర్ క్యాన్ల చిత్రాలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకొని రష్యా అధికారులతో మాట్లాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వెంటనే సదరు కంపెనీపై తగిన చర్యలు తీసుకునేలా భారత దౌత్య అధికారులు రష్యాతో చర్చలు జరుపాలని అహింసావాదులు డిమాండ్ చేస్తున్నారు.
మహా కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి.. 19 మందికి గాయాలు
Here's Video:
रूसी कंपनी की बियर बोतल पर छपी महात्मा गांधी की तस्वीर📷
#Beer #Russia pic.twitter.com/Mvo6j0qXkA
— Online News India (@OnlineNewsIndi1) February 14, 2025
వీడియోలో ఏముంది?
గాంధీజీ చిత్రాలున్న రివోల్ట్ బీర్ క్యాన్లను ఇద్దరు భారతీయులు పట్టుకొని మాట్లాడుతున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో చాలా మంది షేర్ చేశారు. రివోల్ట్ కంపెనీ చర్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అగౌరవనీయమని, దిగ్భ్రాంతి కలిగించేదని కొందరు అన్నారు. ఇది ఆమోద యోగ్యం కాదని మరొకరు వ్యాఖ్యానించారు.