TGSRTC Special Buses: ప్ర‌యాణికుల‌కు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్, వాటిలో చార్జీల త‌గ్గింపు, కార్తీక మాసం సంద‌ర్భంగా ప్ర‌త్యేక స‌ర్వీసులు

ఈ కార్తీక మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రముఖ శైవక్షేత్రాలకు (Karthika Masam 2024) వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్ర కార్తీ మాసం సందర్భంగా టీజీఆర్టీసీ (TGSRTC) ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రసిద్ధ శైవక్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను (TGSRTC Special Buses) ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.

TSRTC Bus (Credits: X)

Hyderabad, NOV 02: కార్తీక మాసం శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్తీక మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రముఖ శైవక్షేత్రాలకు (Karthika Masam 2024) వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్ర కార్తీ మాసం సందర్భంగా టీజీఆర్టీసీ (TGSRTC) ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రసిద్ధ శైవక్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను (TGSRTC Special Buses) ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. శ్రీశైలం (Srisailam), వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట, తదితర దేవాలయాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.

Andhra Pradesh: ప్రయాణికుడిని కొట్టిన బస్ డ్రైవర్ .... డ్రైవర్ కి దేహశుద్ధి చేసిన స్థానికులు..వీడియో ఇదిగో 

ఆర్టీసీ పనితీరు, కార్తీక మాసం ఛాలెంజ్, శబరిమల ఆపరేషన్స్, మహాలక్ష్మీ పథకం, తదితర అంశాలపై హైదరాబాద్ బస్ భవన్ నుంచి శనివారం వర్చువల్ గా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని సజ్జనర్ నిర్వహించారు. ఆర్టీసీకి కార్తీక మాసం, శబరిమల ఆపరేషన్స్ ఎంతో కీలకమని, భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆది, సోమ వారాల్లో శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

Telangana: తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు కింద పడి మహిళ మృతి, డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

ఈనెల 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వివరించారు. అయితే, ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ల కోసం tgsrtcbus.in వెబ్ సైట్ సంప్రదించాలని, మరిన్ని వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్ర‌దించాల‌ని సజ్జనర్ సూచించారు.

అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించినట్లు సజ్జనర్ తెలిపారు. పల్లె వెలుగు కిలో మీటర్ కు రూ. 11, ఎక్స్ ప్రెస్ రూ.7, డీలక్స్ రూ. 8, సూపర్ లగ్జరీ రూ. 6, రాజధాని రూ. 7 మేర తగ్గించినట్లు పేర్కొన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif