Thief at Basara Temple: బాసర అమ్మవారి ఆలయంలో చోరీ.. గోడ దూకి చొరబడిన దుండగుడు.. చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ
నిర్మల్ లోని బాసరలో కొలువైన సరస్వతీ అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయం లోపలికి గోడ దూకి చొరబడిన దుండగుడు ఆలయంలోని చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ చేశాడు.
Basara, Aug 16: నిర్మల్ లోని బాసరలో (Basara) కొలువైన సరస్వతీ అమ్మవారి ఆలయంలో (Saraswathi Temple) చోరీ జరిగింది. ఆలయం లోపలికి గోడ దూకి చొరబడిన దుండగుడు ఆలయంలోని చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ చేశాడు. టికెట్ కౌంటర్ దగ్గర తచ్చాడాడు. అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఎంతమేరకు చోరీ జరిగిందో తెలియాల్సి ఉంది.
చోరీ జరిగిన స్థలాలు..
అమ్మవారి ఆలయంలో ప్రసాదం టికెట్ కౌంటర్, ఉప ఆలయం దత్తాత్రేయ ఆలయం ముందర ఉన్న హుండీలో నగదు, ఆ హుండీలో భక్తులు మొక్కులు చెల్లించిన బంగారం, వెండి చిన్న ఆభరణాలు, మహంకాళి ఆలయం ముందర ఉన్న కౌంటర్ తదితర ప్రాంతాల్లో చోరీ జరిగినట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం
Drunken Women Hulchul At KPHB: కేపీహెచ్ బీలో యువతుల హల్ చల్.. మద్యం మత్తులో కారుతో బీభత్సం.. వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement